బిగ్‌బాస్ సీజన్ 8 మూడో వారం ఎలిమినేషన్ సమయం దగ్గరకు వచ్చింది. మరికొన్ని గంటల్లో ఎవరు బయటకు వెళ్లనున్నారనే విషయంపై క్లారిటీ రానుంది. మరోవైపు రెండు రోజులుగా సాగిన ప్రభావతి 2.0 టాస్కు ఎట్టకేలకు ముగిసింది. చివరకు హౌస్ చీఫ్ గా మరోసారి గెలిచాడు నిఖిల్. ఈసారి మొత్తం 14 మంది కంటెస్టెంట్లతో ఈ షో ప్రారంభంకాగా.. ఇప్పటివరకు ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారం బెజవాడ బేబక్క బయటకు రాగా.. రెండో వారం ఎవరు ఊహించని విధంగా శేఖర్ భాషా ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఈ వారం డేంజర్ జోన్ లో పృథ్వీ, అభయ్ చిట్ట చివరి స్థానాల్లో ఉన్నట్లు సమాచారం. అయితే సోషల్ మీడియా నివేదికల ప్రకారం మూడో వారం అభయ్ ఎలిమినేట్ కానున్నాడనే టాక్ వినిపిస్తుంది.
ఇదిలా ఉంటే… తాజాగా బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్స్ గురించి ఇప్పుడు నెట్టింట ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఈ సీజన్లో అత్యధిక పారితోషికం పొందిన కంటెస్టెంట్ నటుడు ఆదిత్య ఓం అని నివేదికలు సూచించాయి. కానీ అతడి కంటే ఎక్కువగా యాంకర్ విష్ణుప్రియ పారితోషికం ఉందని అంటున్నారు. అవును బిగ్‌బాస్ 8 తెలుగు షోలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కంటెస్టెంట్ విష్ణుప్రియ. ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం ఆమెకు వారానికి రూ.5.5 లక్షలు అని.. అదనంగా 18% GSTతో కలిసి మొత్తం రూ.6.49 లక్షలు అంటున్నారు. అదిత్య ఓంకు ఎక్కువగానే చెల్లించినప్పటికీ వారానికి రూ.5 లక్షలు ఇస్తున్నారట.
విష్ణుప్రియ.. బిగ్‌బాస్ రియాల్టీ షో కంటే ముందే తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన యాంకర్. అంతేకాదు.. అచ్చ తెలుగమ్మాయి. సోషల్ మీడియాలో విష్ణుకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ సీజన్ అత్యంత డిమాండ్ ఉన్న కంటెస్టెంట్ విష్ణుప్రియ.. అలాగే ఇప్పటివరకు విష్ణుకు సపోర్ట్ పెరుగుతూనే ఉంది. దీంతో ఆమె టాప్ 5లో ఉండడం పక్కా అంటున్నారు. విష్ణుప్రియ భీమినేని పాపులర్ షో పోవే పోరాకు హోస్ట్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆమె 2005లో మయూఖం సినిమాతో మలయాళ చిత్ర పరిశ్రమలో తొలిసారిగా నటించింది. పవన్ సాదినేని దర్శకత్వం వహించిన ప్రముఖ టీవీ షో దయాలో కూడా విష్ణుప్రియ కనిపించింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.