Dethadi Harika : తెలంగాణ టూరిజం శాఖ బ్రాండ్ అంబాసిడర్ వివాదం పై క్లారిటీ ఇచ్చిన హారిక..

దేతడి హారిక ఈ పేరు తెలియని యువత  ఉండరేమో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించి ఈ అమ్మడు ఫెమ్స్ అయ్యింది. తెలంగాణ యాసలో మాట్లాడుతూ హారిక చేసిన వీడియోలు యూట్యూబ్ లో తెగ ట్రెండ్ అయ్యాయి.

Dethadi Harika :  తెలంగాణ టూరిజం శాఖ బ్రాండ్ అంబాసిడర్ వివాదం పై క్లారిటీ ఇచ్చిన హారిక..

Edited By:

Updated on: Mar 11, 2021 | 7:28 AM

Dethadi Harika: దేతడి హారిక ఈ పేరు తెలియని యువత  ఉండరేమో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించి ఈ అమ్మడు ఫెమ్స్ అయ్యింది. తెలంగాణ యాసలో మాట్లాడుతూ హారిక చేసిన వీడియోలు యూట్యూబ్ లో తెగ ట్రెండ్ అయ్యాయి. ఆ పాపులారిటీని హరికను బిగ్ బాస్ కు చేర్చింది. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఏ ముద్దుగుమ్మ స్పెషల్ యట్రక్షన్ గా నిలిచిందని చెప్పాలి. తనదైన స్టైల్ లో గేమ్ ఆడుతూ అందరికి ఆకట్టుకుంది హారిక. ప్రస్తుతం కొన్ని వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉంది ఈ బ్యూటీ. అయితే తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా హారికను సోమవారం నియమించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్త జారీ చేశారు. అపాయిట్‌మెంట్ ఆర్డర్ సైతం హారికకు అందజేశారు.

మంత్రికి, ఉన్నతాధికారులకు సమాచారం లేకుండా నియామకం జరిగినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై టూరిజం శాఖ మంత్రితో పాటు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. వ్యవహారం చీఫ్ సెక్రటరీ వరకు వెళ్లింది. దీంతో వెంటనే అలర్టెయిన అధికారులు అధికారిక వెబ్‌సైట్‌లో హారిక అలేఖ్యకు నియామకానికి సంబంధించిన వివరాలను తొలగించారు. తాజాగా ఈ విషయం పై హారిక స్పంధించింది. ఈ విషయం పై క్లారిటీ ఇస్తూ ఒక వీడియోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. హారిక మాట్లాడుతూ..”మహిళాదినోత్సవం రోజున తనను తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేశారు. అనుకోని కారణాల వాళ్ళ నేను దానిని కొనసాగించలేక పోతున్న. తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా నేను తప్పుకుంటున్నా నన్ను సపోర్ట్ చేసిన వారందరికి కృతజ్ఞతలు . నా యూట్యూబ్ వీడియోస్, సిరీస్ లపైనా దృష్టి పెడుతున్న” అంటూ చెప్పుకొచ్చింది హారిక .

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ram Pothineni : హ్యాట్రిక్ హిట్ కోసం సిద్దమవుతున్న యంగ్ హీరో.. కథ విషయంలో తగ్గేదే లేదంటున్న రామ్..

Nikhil Siddharth: హీరో నిఖిల్ సిద్ధార్ధ్‌కు గాయాలు.. కార్తికేయ 2 షూటింగ్‌లో యాక్షన్‌ స్టంట్స్‌ చేస్తుండగా ప్రమాదం

Saranga Dariya controversy: వివాదంపై తొలిసారి స్పందించిన దర్శకుడు శేఖర్ కమ్ముల.. ఆయన ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు

 

Loading...
Unable to load recommendations.
Follow Us