Brahmamudi, August 5th Episode: ట్విస్ట్ ఇచ్చిన అనామిక.. కళ్యాణ్, అప్పూల పెళ్లి ఇక ఫిక్స్..

|

Aug 05, 2024 | 12:49 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. అప్పూతో పెళ్లి చేయాలి అనుకున్న రాజ్.. ఏదో ఒకటి చెప్పి అప్పూని తీసుకెళ్తున్నా అనుకుంటాడు. కట్ చేస్తే కావ్య వచ్చి కారులో కూర్చొంటుంది. ఇక కారు స్టార్ట్ చేద్దాం అనుకున్న సమయంలో ప్రకాశం వచ్చి.. ఇప్పుడు పెళ్లి పెట్టుకుని ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకు వెళ్తున్నారు? అని అడుగుతాడు. అర్జెంట్ బాబాయ్.. పెళ్లిలో బెల్లం తీసుకొచ్చారు. కానీ జీలకర్ర లేదట. అది తీసుకురావడానికి అని ఏదో ఒకటి చెప్పి..

Brahmamudi, August 5th Episode: ట్విస్ట్ ఇచ్చిన అనామిక.. కళ్యాణ్, అప్పూల పెళ్లి ఇక ఫిక్స్..
Brahmamudi
Follow us on

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. అప్పూతో పెళ్లి చేయాలి అనుకున్న రాజ్.. ఏదో ఒకటి చెప్పి అప్పూని తీసుకెళ్తున్నా అనుకుంటాడు. కట్ చేస్తే కావ్య వచ్చి కారులో కూర్చొంటుంది. ఇక కారు స్టార్ట్ చేద్దాం అనుకున్న సమయంలో ప్రకాశం వచ్చి.. ఇప్పుడు పెళ్లి పెట్టుకుని ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకు వెళ్తున్నారు? అని అడుగుతాడు. అర్జెంట్ బాబాయ్.. పెళ్లిలో బెల్లం తీసుకొచ్చారు. కానీ జీలకర్ర లేదట. అది తీసుకురావడానికి అని ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తాడు. సరేలే మీరు వెళ్లండి. ముందు నా పని నేను కానిచ్చుకుంటాను అని చెప్తాడు ప్రకాశం. ఇక కారును స్టార్ట్ చేసి వెళ్తాడు రాజ్. మొత్తానికి నువ్వు ధైర్యం చేసి వచ్చావు. కానీ మా బాబాయ్ చూసేశాడు. అందరికీ తెలిసే లోపు కళ్యాణ్‌ని రమ్మని పెళ్లి చేసేస్తా. నా ఫ్రెండ్స్ ఇప్పటికే అన్నీ సిద్ధంగా రెడీ చేశారని రాజ్ అంటాడు. ఇక కావ్య.. అప్పూ వాయిస్‌లో మాట్లాడుతూ.. దూప్ అయితుంది బావా చెట్టు కింద ఆపు ఒక బొండం తాగుతానని చెప్తుంది. అర్థం కాని రాజ్ దూప్ అంటే ఏంటి అని అడుగుతాడు. కొబ్బరి బొండాం తాగుతానని అంటుంది కావ్య. అంత టైమ్ లేదు ముందు పెళ్లి జరిగి పోవాలని చెప్తాడు రాజ్.

రాక్షసి ఎంత పని చేశావ్?

ఊరుకో బావా.. పెళ్లి అయిన వాళ్లకు మళ్లీ పెళ్లి ఏంటి? అని కావ్య అంటే.. ఏయ్ మెంటల్ ఏమన్నా ఎక్కిందా? పొట్టి జుట్టు దానా అని రాజ్ అంటూ వెనక్కి చూస్తే కావ్య చూసి షాక్ అయి వెంటనే కారు ఆపుతాడు. ఏయ్ నువ్వేంటే ఇక్కడ.. ఎలా వచ్చావు ఇక్కడికి అని అడుగుతాడు రాజ్. కావ్య జరిగింది అంతా చెప్తుంది కావ్య. లాస్ట్ మినిట్‌లో వచ్చి మొత్తం చెడగొట్టావు అని రాజ్ కావ్యని తిడతాడు. ముందు పెళ్లికి వెళ్దాం పదండి అని కావ్య అంటే.. ఇక రాజ్ తప్పదు అన్నట్టు కారు తిప్పుతాడు. ఇద్దరూ కలిసి పెళ్లికి వెళ్తారు. మరోవైపు అందరూ పెళ్లి దగ్గర ఉంటారు. కారు దిగి లోపలికి వెళ్తున్న సమయంలో.. రాక్షసి ఎంత పని చేశావ్? నీ కంటే మా రుద్రాణి అత్తే నయ్యం అని రాజ్ అంటే.. ఏవండీ మీరు బండ బూతులు తిట్టండి పడతాను. కొట్టినా పడతాను. కానీ పోయి పోయి ఆ రుద్రాణితో పోల్చితే మాత్రం అస్సలు ఊరుకోను. ఆ మాట పడటం కంటే ఎందులోకి అయినా దూకి చావడం మంచిదని కావ్య అంటుంది. అప్పుడే ప్రకాశం వచ్చి రేయ్ ఏదిరా అని అడుగుతాడు. ఏంటి అని రాజ్ అంటే.. జీలకర్ర అని చెప్తాడు. జేబులో ఉందని కవర్ చేస్తాడు రాజ్. మరోవైపు కళ్యాణ్ పెళ్లికి వస్తూ ఉంటాడు.

కనిపించని అప్పూ.. భయంలో రుద్రాణి, ధాన్య లక్ష్మి..

ఇక అందరూ పెళ్లి దగ్గర ఉంటారు. అప్పుడే పెళ్లి కొడుకును, పెళ్లి కూతుర్ని తీసుకు రమ్మని పంతులు చెబితే.. ధాన్య లక్ష్మి హమ్మయ్యా ఇద్దరూ మండపంలో కూర్చొంటే అంతే చాలని అంటుంది. పెళ్లి కొడుకు వచ్చి కూర్చొంటాడు. కానీ అప్పుడే స్వప్న పరిగెత్తుకుంటూ వచ్చి.. అప్పూ గదిలో లేదని చెబుతుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. అంతా వెతికాను ఎక్కడా లేదని అంటుంది స్వప్న. మరోవైపు ధాన్య లక్ష్మి, రుద్రాణిలు భయ పడుతూ ఉంటారు. అప్పుడే కావ్య వచ్చి రాజ్‌ని చూస్తుంది. అప్పూ ఎక్కడికి వెళ్లిందని అడుగుతుంది. సరిగా చూడకుండా ఆ మాట చెబుతావేంటి? స్వప్న అని ఇందిరా దేవి అంటుంది. అందరం వెళ్లి చూద్దాం పదండి అని అపర్ణ అంటుంది. ధాన్య లక్ష్మి అక్కడ నీ కొడుకు కూడా జంప్ అని రుద్రాణి చెబుతుంది. దీంతో ఆవేశం తెచ్చుకున్న ధాన్య లక్ష్మి.. ఎక్కడని వెతుకుతారు? మండపం దాటించింది మీరే కదా అని రాజ్, కావ్యలను అంటుంది. ఏం అంటున్నారు మీరు? అని కావ్య అంటుంది. మీరే తీసుకెళ్లి పోయారని ధాన్య లక్ష్మి అంటుంది.

ఇవి కూడా చదవండి

అప్పూని మీరే బయటకు తీసుకెళ్లారు..

ఇప్పుడు అంత అర్జెంటుగా మండపం నుంచి బయటకు వెళ్లాల్సిన అవసరం వీళ్లకు ఏం అవచ్చిందని? ధాన్య లక్ష్మి అంటుంది. తప్పిపోయిన వాళ్లను వెతకొచ్చు.. లేచి పోయిన వాళ్లను కాదు. మీ అక్క పీటల మీద నుంచి లేచి వెళ్లి పోయింది కదా అని రుద్రాణి అంటుంది. మనకు తెలియకుండా ఏదో జరుగుతుంది. అన్నింటికీ నీ కోడలే సూత్రధారి అని ధాన్య లక్ష్మి అంటే.. రాజ్ ఊరుకోకుండా వార్నింగ్ ఇస్తుంది. చాలు ఆపండి మీ టార్గెట్ ఎంటో అందరికీ తెలుసు. నువ్వు ఎన్ని మోసాలు.. అబద్దాలు.. మాయలు చేశావో అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ కొత్త నాటకం ఆడి నీ మూడో కూతుర్ని కూడా మా ఇంటికి పంపించాలనే కదా నువ్వు ఆశ పడేదని కనకాన్ని రుద్రాణి అంటుంది. రుద్రాణిపై కావ్య, స్వప్నలు వార్నింగ్ ఇస్తుంది.

ఇద్దరూ కలిసి ఖచ్చితంగా వెళ్లిపోయారు..

నా చిన్న కూతురు నిప్పు.. ఒక్క మా అన్నా పడదు. అది ఏమైందోనని మా గుండె దడదడ లాడుతుందని కృష్ణ మూర్తి అంటాడు. అప్పూ తనని తాను కాపాడుకోగలదు. ఏదో జరిగింది.. ముందు వెళ్లి అప్పూని వెతుకుదామని సుభాష్ అంటాడు. ఇంట్లో నుంచి కదలకుండా తాళం వేసి వస్తే.. కళ్యాణ్ తప్పించుకుని పారపోయాడు. ఇక్కడ అప్పూ కూడా కనిపించడం లేదు. ఇద్దరూ కలిసి ఖచ్చితంగా వెళ్లి పోయారని ధాన్య లక్ష్మి అంటే.. అలాంటిదేమీ జరగదు.. వెళ్లి అప్పూని వెతుకుదామని కావ్య, రాజ్‌లు వెళ్తారు. ఎంత వెతికినా ఎక్కడా కనిపించదు.

అప్పూని కిడ్నాప్ చేసిన అనామిక..

కట్ చేస్తే.. అప్పూని అనామిక కిడ్నాప్ చేస్తుంది. నువ్వా.. నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది నువ్వా? అని అప్పూ అడిగితే.. నేనే.. అని అనామిక అంటుంది. జైలుకు వెళ్లి వచ్చినా బుద్ధి లేదా? అని అప్పూ అంటే.. నేను జైలుకు వెళ్లడానికి కారణం అయినా ఒక్కొక్కర్ని.. ఆట ఆడుకోవడానికే వచ్చాను. ముందు నీతోనే మొదలు పెట్టానని అనామిక అంటుంది. అయినా అప్పూ భయ పడదు. నేను అనుకున్నది పూర్తి చేశాక సంవత్సరం ఏంటి.. జీవితాంతం జైలు శిక్ష అనుభవిస్తాను. నన్ను ప్రపంచం దృష్టిలో దోషిని చేసిన నువ్వు శిక్ష అనుభవించాల్సిందే. నీ మీద పడ్డ నిందను నిజం చేస్తాను. టా ఫస్ట్ టార్గెట్ నువ్వే అని అనామిక అంటుంది. నన్ను తీసుకొచ్చి నువ్వు ఏం సాధిస్తావని అప్పూ అడుగుతుంది. నీ క్యారెక్టర్ మీద వేసిన నింద ఇప్పుడు నిజం అవుతుంది. నువ్వు నచ్చిన వాడితో లేచిపోయావని అనుకుంటారని అనామిక అంటుంది. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్‌ ముగుస్తుంది.