Bigg Boss 5 Telugu: బిగ్ బాస్‌కు కరోనా సెగ.. ఇద్దరికి పాజిటివ్.. లిస్టులో మార్పులు!

|

Aug 28, 2021 | 7:19 PM

Bigg Boss Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5కు కరోనా సెగ తగిలింది. క్వారంటైన్‌లో ఉన్న ఇద్దరు కంటెస్టెంట్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది.

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్‌కు కరోనా సెగ.. ఇద్దరికి పాజిటివ్.. లిస్టులో మార్పులు!
Big Boss 5
Follow us on

బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్‌గా ప్రారంభం కాబోతోంది. సెప్టెంబర్ 5 నుంచి ఈ షో ప్రసారం కానుండగా.. అదే రోజున మొత్తం కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తారు. ఇక ఇప్పటికే కంటెస్టెంట్లు క్వారంటైన్‌లో ఉన్నారు. అంతా బాగానే ఉందని అనుకునేలోపే.. ఈ రియాలిటీ షోకు కరోనా సెగ తాకింది. ఇద్దరు కంటెస్టెంట్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వారిని క్వారంటైన్‌లో ఉంచినట్లు సమాచారం. అలాగే కంటెస్టెంట్ల లిస్టులో మార్పులు జరిగే అవకాశం ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే దీనిపై బిగ్ బాస్ యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఇదిలా ఉంటే షో ప్రారంభం కానున్న తేదీ దగ్గర పడుతుండటంతో.. కొంతమంది కంటెస్టెంట్ల పేర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. యాంకర్‌ రవి, లోబో, కార్తీకదీపం ఫేమ్‌ ఉమాదేవి, నటి లహరి, యానీ మాస్టర్, సిరి హన్మంత్‌, ట్రాన్స్‌ జెండర్‌ ప్రియాంక, నటి ప్రియ, నవ్య స్వామి, సరయు సుమన్, షణ్ముఖ్ జస్వంత్, వీజే సన్నీ, ఆర్జే కాజల్, కోమలి, వర్షిణి, జ్యోతిలు లిస్టులో ఉన్నారు. మరి వీరిలో ఎవరు బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెడతారో వేచి చూడాలి. అంతేకాకుండా గత కొద్దిరోజులుగా వీరితో పాటు కొరియోగ్రాఫర్‌ నటరాజ్‌, సింగర్‌ శ్రీరామచంద్ర పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కాగా, బిగ్ బాస్ ఐదో సీజన్‌కు అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ రియాలిటీ షో సోమవారం నుంచి గురువారం వరకు రాత్రి 10 గంటలకు.. అలాగే శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకు స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతుంది.

ఇవి చదవండి: