బిగ్బాస్ సీజన్ 5 నాలుగు, ఐదో వారాల నుంచి ఆట రసవత్తరంగా సాగుతోంది. మొదటి రెండు మూడు వారాలు అంత ఆసక్తిగా లేకపోయినా.. రాను రాను కంటెస్టెంట్స్ ఆటతీరులో కాస్త ఎక్కువగానే మార్పులు జరిగాయి. ఇప్పటివరకు బిగ్బాస్ గేమ్ షో 60 రోజులు పూర్తిచేసుకుంది. అంటే దాదాపు సగం షో విజయవంతంగా పూర్తైంది. మొత్తం 19 మందితో ప్రారంభమైన ఈ షో ఇప్పుడు 11 మందికి చేరింది. తొలివారంలో సరయూ.. రెండవ వారంలో కార్తీక దీపం ఫేమ్ ఉమాదేవి ఎలిమినేట్ కాగా.. మూడో వారంలో లహరి.. నాలుగో వారంలో నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. ఇక ఆ తర్వాత ఐదో వారంలో హమీదా.. ఆ తర్వాత శ్వేత .. ఇక ఏడో వారంలో ప్రియ ఎలిమినేట్ అయ్యారు.
ఎలిమినేట్ అనంతరం ఒక్కోక్కరు ఇంటర్వ్యూలు ఇస్తూ.. షో గురించి.. కంటెస్టెంట్స్ గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. తాజాగా ఎలిమినేట్ అయిన సభ్యులంతా ఒక్కచోటుకి చేరారు. శ్వేత, ఉమాదేవి, ప్రియ, లహరి, నటరాజ్ మాస్టర్, హమీదా అందరూ ఒక్కచోటకు చేరి సందడి చేసినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో సరయు మాత్రం కనిపించడం లేదు. సరయు మినహా.. ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన సభ్యులంతా కలిసి తెగ ఎంజాయ్ చేసినట్లుగా ఫోటలను చూస్తే అర్థమవుతుంది. ఇక ఎనిమిదవ వారంలో బిగ్ బాస్ ఇంటి లోబో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక తొమ్మిదో వారంలో కెప్టెన్ షన్నూ మినహా.. అందరూ కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు.
Also Read: Shyam Singha Roy: తిరగబడిన సంగ్రామం.. వెనకబడని చైతన్యం.. అంచనాలను పెంచేసిన శ్యామ్ సింగరాయ్..
Balakrishna: ఆసుపత్రిలో బాలకృష్ణ.. సర్జరీ చేసిన వైద్యులు.. హెల్త్ అప్డేట్..
Bigg Boss 5 Telugu: నెట్టింట్లో వైరల్ అవుతున్న లోబో రెమ్యునరేషన్.. ఇంతకీ ఎంత తీసుకున్నాడంటే..
Kasturi Shankar: కమింగ్ సూన్.. ఆప్ ట్రావెల్స్ అండ్ టూర్స్.. నటీ కస్తూరి షాకింగ్ కామెంట్స్ వైరల్..