మణిరత్నం కోసం పారితోషికాలు తగ్గించుకున్న స్టార్స్
వరుస అపజయాలతో ఉన్న లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం ఇంజువెల్లం అనే ప్రయోగాత్మక రొమాంటిక్ డ్రామాతో వస్తున్నారు. ఈ లో-బడ్జెట్ ప్రాజెక్ట్ కోసం సాయి పల్లవి, విజయ్ సేతుపతి వంటి అగ్రతారలు తమ పారితోషికాలను గణనీయంగా తగ్గించుకున్నారు. మణిరత్నం విజన్‌పై గౌరవంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు.
వరుస అపజయాలతో సతమతమవుతున్న దిగ్గజ దర్శకుడు మణిరత్నం, ఇప్పుడు ఒక ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. “ఇంజువెల్లం” పేరుతో రానున్న ఈ రొమాంటిక్ డ్రామాను చాలా తక్కువ బడ్జెట్‌లో, వాస్తవ లొకేషన్లలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం మణిరత్నం ఒక కీలక నిర్ణయం తీసుకోగా, ఆయనకు మద్దతుగా చిత్ర బృందం కూడా అలాంటి నిర్ణయాన్నే తీసుకుంది. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్న విజయ్ సేతుపతి, సాయి పల్లవి తమ రెమ్యునరేషన్‌ను గణనీయంగా తగ్గించుకున్నారు. సాధారణంగా ఒక్కో సినిమాకు రూ. 10 నుండి 12 కోట్లు పారితోషికం తీసుకునే సాయి పల్లవి, మణిరత్నంపై గౌరవంతో ఇంజువెల్లం కోసం కేవలం రూ. 3 కోట్లు మాత్రమే తీసుకున్నారు. గతంలో చాలాసార్లు మణిరత్నం సినిమాలో నటించడం తన కల అని చెప్పిన ఆమె, ఈ అవకాశాన్ని కోల్పోకూడదని నిర్ణయించుకున్నారు. అలాగే, రూ. 15 కోట్ల వరకు డిమాండ్ చేసే విజయ్ సేతుపతి కూడా రూ. 6 కోట్లు మాత్రమే తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ నవంబర్ కల్లా పూర్తయ్యి, 2027 జనవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
అనుభవం నుంచి నేర్చుకున్న పాఠం.. ఈసారి మహేష్ బాకీ తీర్చేస్తాడా?
నిన్న నాని.. నేడు విజయ్.. ఇది సీరియస్ మ్యాటర్..!
టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్న మమితా బైజు
