మ‌రోసారి దాతృత్వాన్ని చాటుకున్న సోనూసూద్.. పసివాడికి ప్రాణం పోసిన రియల్ హీరో..

సోనూసూద్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. నాలుగు నెలల చిన్నారి అద్విత్‌ శౌర్య గుండె సంబంధిత సర్జరీకి నిమిత్తం రూ. 8 లక్షల ఆర్ధిక సాయం..

మ‌రోసారి దాతృత్వాన్ని చాటుకున్న సోనూసూద్.. పసివాడికి ప్రాణం పోసిన రియల్ హీరో..
Follow us

|

Updated on: Nov 12, 2020 | 9:45 PM

Sonu Sood Help: ఎక్క‌డ ఆప‌ద ఉన్నా క్ష‌ణాల్లో సాయం చేసేందుకు ముందుకొస్తున్న నటుడు సోనూసూద్.. లాక్‌డౌన్‌ మొదలైన నాటి నుంచి ఎందరికో సాయం చేస్తూ యావత్ భారతదేశానికి రియల్‌ హీరోగా మారిపోయారు. తాజాగా ఆయన మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. నాలుగు నెలల చిన్నారి అద్విత్‌ శౌర్య గుండె సంబంధిత సర్జరీకి నిమిత్తం రూ. 8 లక్షల ఆర్ధిక సాయం చేసేందుకు సోనూసూద్ ముందుకు వచ్చారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా జగ్గారావుపల్లె గ్రామానికి చెందిన బాబు, రజితల నాలుగు నెలల కుమారుడు అద్విత్‌ శౌర్య గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చిన్నారికి తల్లిదండ్రులు పరీక్ష చేయించగా.. వెంటనే హార్ట్ సర్జరీ చేయాలని.. ఇందుకు రూ. 8 లక్షల ఖర్చు అవుతుందని అక్కడి వైద్యులు చెప్పారు. వారి దగ్గర అంత స్థోమత లేకపోవడంతో సహాయం కోసం చాలామందిని అడిగారు. అయితే ప్రతీ చోటా వారికి నిరుత్సాహమే ఎదురైంది.

కాగా, తల్లిదండ్రుల ఆవేదనను గుర్తించిన కొంతమంది గ్రామస్థులు.. విషయాన్ని సోనూసూద్‌కు చేరేలా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దానిని చూసిన నటుడు సోనూసూద్ వెంటనే స్పందించారు. గుండె సంబంధిత సర్జరీకి అయ్యే ఖర్చు మొత్తాన్ని తాను భరిస్తానని.. హైదరాబాద్ ఇన్నోవా హాస్పిటల్‌లో ఆపరేషన్‌కు ఏర్పాటు చేశామని ట్వీట్ చేశారు. ఈ విషయంపై ఆయన సిబ్బంది బుధవారం బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. ఆపరేషన్‌ను డాక్టర్ కోన సాంబమూర్తి చేయనున్నట్లు తెలిపారు. కాగా, గ్రామస్థులు కూడా ఇతర వైద్య ఖర్చుల కోసం రూ. 40 వేలు సాయం చేశారు.