‘కొబ్బరి మట్ట’ రిలీజ్ డేట్ ఫిక్స్..!

|

Jun 20, 2019 | 7:10 PM

కామెడీ హీరో సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’ సినిమాకు ఎట్టికేలకు మోక్షం దక్కింది. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఈ సినిమాకు విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు చిత్ర నిర్మాతలు. ఈ చిత్రం జూలై 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. సంపూర్ణేష్ బాబు గత చిత్రాల మాదిరి ఈ సినిమా కూడా స్పూఫ్ కామెడీ కథాంశంతో తెరకెక్కింది. నూతన దర్శకుడు రూపక రొనాల్డ్‌సన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని’హృదయ కాలేయం’ దర్శకుడు స్టీవెన్ శంకర్ నిర్మిస్తున్నాడు. ఇషికా […]

కొబ్బరి మట్ట రిలీజ్ డేట్ ఫిక్స్..!
Follow us on

కామెడీ హీరో సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’ సినిమాకు ఎట్టికేలకు మోక్షం దక్కింది. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఈ సినిమాకు విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు చిత్ర నిర్మాతలు. ఈ చిత్రం జూలై 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. సంపూర్ణేష్ బాబు గత చిత్రాల మాదిరి ఈ సినిమా కూడా స్పూఫ్ కామెడీ కథాంశంతో తెరకెక్కింది.

నూతన దర్శకుడు రూపక రొనాల్డ్‌సన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని’హృదయ కాలేయం’ దర్శకుడు స్టీవెన్ శంకర్ నిర్మిస్తున్నాడు. ఇషికా సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఈ సినిమాతో సంపూ మళ్ళీ ఫామ్‌లోకి వస్తాడో లేదో వేచి చూడాలి..?