
న్యాచురల్ స్టార్ నాని సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ది ప్యారడైజ్ చిత్రంతో అడియన్స్ ముందుకు వచ్చిన నాని.. ఇప్పుడు బ్లడీ రోమియో చిత్రంలో నటిస్తున్నారు. అలాగే తాజాగా మరో సెన్సిబుల్ లవ్ స్టోరీ చేసేందుకు రెడీ అయినట్లు టాక్. తమిళంలో ’96’, ఇటీవల వచ్చిన ‘మెయ్యళగన్’ (తెలుగులో ‘సత్యం సుందరం’) వంటి ఎమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకున్న సి. ప్రేమ్‌కుమార్ దర్శకత్వంలో నాని ఓ కొత్త చిత్రాన్ని చేయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా పూర్తిగా లవ్ అండ్ ఎమోషన్‌తో కూడిన కథాంశంతో తెరకెక్కనుందని టాక్. కథ ప్రకారం ఇందులో హీరోయిన్ పాత్ర కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా కథను నడిపించేంత బలంగా ఉండనుందట. అలాంటి ప్రాధాన్యత కలిగిన పాత్రకు న్యాయం చేయగల సమర్థురాలైన నటిగా మేకర్స్ రుక్మిణి వసంత్‌ను సంప్రదించారని, ఆమె ఎంపిక దాదాపు ఖరారైనట్లేనని ఫిల్మ్‌నగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
సహజసిద్ధమైన అందం, కట్టిపడేసే అభినయంతో దక్షిణాది చిత్రసీమలో అనతికాలంలోనే విశేష ఆదరణ దక్కించుకున్నారు కన్నడ భామ రుక్మిణి వసంత్. భాషతో సంబంధం లేకుండా బలమైన పాత్రలను ఎంచుకుంటూ వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఈ అందాల తార ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని తదుపరి చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైనట్లు సోషల్ మీడియాలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం ‘డ్రాగన్’లో రుక్మిణి వసంత్ నటిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ సెట్స్‌పై ఉండగానే, ఇప్పుడు నేచురల్ స్టార్ నాని సినిమాకు కూడా ఆమె ఎంపికయ్యారనే వార్త సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కథలకు ప్రాధాన్యతనిచ్చే నాని, ఎమోషన్స్‌ను అద్భుతంగా తెరకెక్కించే ప్రేమ్‌కుమార్ కాంబోలో రాబోయే లవ్ డ్రామాలో రుక్మిణి తోడైతే వెండితెరపై మ్యాజిక్ ఖాయమని ప్రేక్షకులు భావిస్తున్నారు.
రుక్మిణి వసంత్ ప్రయాణం పరిశీలిస్తే ఆమె సెలక్షన్స్ ఎంత పక్కాగా ఉన్నాయో అర్థమవుతుంది. ‘సప్త సాగర దాచే ఎల్లో’ (తెలుగులో ‘సప్త సాగరాలు దాటి’) సినిమాలో ‘ప్రియ’ పాత్రలో ఆమె కనబరిచిన సహజమైన నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత రిషబ్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన విజువల్ వండర్ ‘కాంతార చాప్టర్ 1’లో కీలక పాత్ర పోషించి బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డులను చూశారు. ఈ చిత్రాల విజయాలు ఆమెను పాన్-ఇండియా స్థాయిలో తిరుగులేని స్టార్‌డమ్‌కు చేర్చాయి. టాలీవుడ్ టాప్ హీరోల సరసన వరుసగా అవకాశాలు దక్కించుకుంటున్న రుక్మిణి వసంత్, రాబోయే రోజుల్లో తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా స్థానం సుస్థిరం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నయా కాంబినేషన్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశముంది.
ఎక్కువమంది చదివినవి: Tollywood : అలాంటి నటుడిని ఎక్కడా చూడలేదు.. అతడు ప్రపంచంలోనే నెంబర్ వన్ యాక్టర్.. టాలీవుడ్ విలన్..
ఎక్కువమంది చదివినవి: Trending Song: యూట్యూబ్ షేక్ చేస్తున్న బతుకమ్మ సాంగ్.. రెండు రోజుల్లోనే 7 లక్షల వ్యూస్.. డీజేలలో మారుమోగిపోతుంది..