మెట్రో రైలులో ప్రయాణించిన పవర్‌స్టార్

|

Nov 05, 2020 | 9:56 AM

ఆయన స్టైల్‌కు ఐకాన్..పవర్‌కు కేరాఫ్..ఫ్యాన్ బేస్‌కు ఎవర్‌గ్రీన్..ఇప్పటికే ఆయన రూపం మీ మదిలో మెదిలి ఉంటుంది. యస్..మేము మాట్లాడుతుంది పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ గురించే.

మెట్రో రైలులో ప్రయాణించిన పవర్‌స్టార్
Follow us on

ఆయన స్టైల్‌కు ఐకాన్..పవర్‌కు కేరాఫ్..ఫ్యాన్ బేస్‌కు ఎవర్‌గ్రీన్..ఇప్పటికే ఆయన రూపం మీ మదిలో మెదిలి ఉంటుంది. యస్..మేము మాట్లాడుతుంది పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ గురించే. రాజకీయాల్లోకి వెళ్లి కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న పవన్ ఇటీవలే మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం పవన్ ‘పింక్’ రిమేక్ చిత్రం ‘వకీల్ సాబ్’‌లో నటిస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఆగిపోయిన ఈ ఫిల్మ్ షూటింగ్..తాజాగా పున: ప్రారంభమైంది. ప్రస్తుతం పవన్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో పవన్ షూటింగ్ స్పాట్‌కు వెళ్లేందుకు హైదరాబాద్‌ మెట్రో రైల్లో ప్రయాణించారు. మాదాపూర్ నుంచి మియాపూర్ వరకు మెట్రోలో ప్రయాణించారు. సూట్, బూటులో మెట్రో స్టేషన్‌లోకి ఎంటరయిన పవన్‌ను చూసి ప్రయాణీకులు తన్మయత్వానికి లోనయ్యారు. మెట్రోలో ప్రయాణిస్తోన్న సమయంలో పవన్ తోటి ప్రయాణీకులతో కాసేపు ముచ్చుటించారు. ఈ జర్నీలో పవన్ వెంట మూవీ నిర్మాత దిల్ రాజు కూడా ఉన్నారు.

Also Read :

నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ !

ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన కరోనా పాజిటివ్ మహిళ, అంతా క్షేమం

‘ఆంటీ’ అని పిలిచినందుకు వీర బాదుడు బాదింది

తిరుపతిలో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు