OTT Movie: ఓటీటీలోకి ‘కొరియన్ కనకరాజు’! వరుణ్ తేజ్ రీసెంట్ సూపర్ హిట్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ సినిమా 'కొరియన్ కనకరాజు'. మేర్లపాక గాంధీ తెరకెక్కించిన ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్ గా నటించింది. థియేటర్లలో రూ.60 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది.

గత కొన్నేళ్లుగా వరుస ఫ్లాపులతో సతమతమవుతోన్న వరుణ్ తేజ్ కు కొరియన్ కనకరాజు రూపంలో బిగ్ రిలీఫ్ దొరికింది. ఆగస్టు 07న విడుదలైన ఈ కామెడీ హారర్ థ్రిల్లర్ సూపర్ హిట్ గా నిలిచింది. అంచనాలకు మించి వసూళ్లు సాధించి వరుణ్ తేజ్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచింది. ఇప్పటివరకు ఈ సినిమాకు రూ. 60 కోట్ల మేర కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. థియేటర్లలో రిలీజై మూడు వారాలు గడిచినా కొరియన్ కనకరాజు సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్నాయి. మేర్లపాక గాంధీ తెరకెక్కించిన ఈ సినిమాలో రితికా నాయర్ హీరోయిన్ గా నటించింది. అలాగే కమెడియన్ సత్య ఈ మూవీ సక్సెస్ లో కీ రోల్ పోషించింది. థియేటర్లలో ఆడియెన్స్ కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ ఇచ్చిన కొరియన్ కనకరాజు ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇందుకు గానూ సుమారు రూ. 26 కోట్ల డీల్ జరిగినట్లు తెలుస్తోంది. థియేటర్లలో రిలీజైన నాలుగు లేదా ఐదు వారాల తర్వాత ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకువచ్చేలా ఈ ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన కొరియన్ కనకరాజు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయినట్లు సమాచారం. సెప్టెంబర్ రెండో వారంలో ఈ మూవీ ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10 లేదా 11వ తేదీన కొరియన్ కనకరాజు ఓటీటీలోకి వస్తున్నట్లు టాక్. త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఇక కొరియన్ కనకరాజు సినిమా విషయానికి వస్తే.. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. సునీల్, మురళీధర్ గౌడ్, తులసి, బుల్లిరాజు, వీటీవీ గణేష్, మహేష్ ఆచంట తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. తమన్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు.
మూడో వారంలోనూ కొరియన్ కనకరాజుకు సాలిడ్ కలెక్షన్లు..
The NON-STOP ENTERTAINER #KoreanKanakaraju enters it’s 3RD Week ❤️🔥
The fun madness continues to win hearts everywhere🤩💥
Book your tickets now! — https://t.co/zYQjFkvUIg@IamVarunTej @RitikaNayak_ @GandhiMerlapaka #Satya @MusicThaman #ManojhReddy #RajeevReddy @DirKrish… pic.twitter.com/98qA031oPC
— UV Creations (@UV_Creations) August 21, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




