
ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు సూపర్ హిట్ సినిమాలు ఓటీటీలోకి రానున్నాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం ఇలా వివిధ భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. దృశ్యం 3, అతిరథి, రేజర్, కేనతా కానం, ఎమ్4ఎమ్, సేవ్ ద టైగర్స్ 3 తదితర ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్ లు వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో సందడి చేయనున్నాయి. అయితే వీటి కన్నా ముందే ఓ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే. గతేడాది థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. కంటెంట్ పరంగా ప్రశంసలు కూడా అందుకుంది. అయితే పేరున్న నటీ నటులు లేకపోవడం, పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడం, ఇతర కారణాలతో ఈ మూవీ ఎక్కువ రోజులు థియేటర్లలో ఆడలేకపోయింది. ఇప్పుడీ మూవీ సడెన్ గా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఒక పల్లెటూరిలో వరుసగా జరిగే హత్యలు కలకలం రేపుతాయి . అమ్మాయిలను టార్గెట్ గా చేసుకున్న ఒక సైకో కిల్లర్ వారిని అతి దారుణంగా హతమారుస్తుంటాడు. అంతేకాదు హత్య తర్వాత వారి తలలకు మంకీ మాస్క్ పెడుతుంటాడు. అలా ఒక రోజు హీరో మేనకోడలు కీర్తి కూడా శవంగా కనిపిస్తుంది. దీంతో స్వయంగా అతనే ఇన్వస్టిగేషన్ మొదలు పెడతాడు. ఈ క్రమంలో అతనికి సంచలన విషయాలు తెలుస్తాయి. మరి అమ్మాయిలను చంపుతున్నదెవరు? హత్య చేసి తలలకు మంకీ మాస్క్ పెట్టడానికి గల కారణాలు ఏంటీ? ఒక సాధారణ కానిస్టేబుల్ అయిన హీరో ఈ హత్యలను ఆపగలిగాడా? క్రిమినల్ ను పట్టుకున్నాడా? లేదా? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ఈ ఈ సినిమా పేరు కానిస్టేబుల్. మధులిక వారణాసి హీరోయిన్‌గా చేసింది. మురళిధర్ గౌడ్, పుష్ప ఫేమ్ కల్ప లత, రవి వర్మ, సూర్య, నిత్య శ్రీ, కశిష్ రాజ్‌పుత్ తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. ఇప్పటికే ఈ సినిమా ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుండగా, బుధవారం నుంచి ఆహా ఓటీటీలోకి కూడా అందుబాటులోకి వచ్చేసింది.
Telugu film #Constable (2025) by #AryanSubhan, now streaming on @ahavideoIN .
Ft. #VarunSandesh #MadhulikaVaranasi #Nithyasri #KashishhRajput #Surya #KalphaLatha & #MuralidharGoud.#SubhashAnandh @divomusicindia pic.twitter.com/ucK8G0Cf3V
— CinemaRare (@CinemaRareIN) June 17, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి