AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: అమ్మాయిలకు మంకీ మాస్క్ పెట్టి హతమార్చే సైకో కిల్లర్.. ఓటీటీలో ఈ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ చూశారా?

గత వారమే ఓటీటీలోకి వచ్చిన ఈ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందిస్తోంది. ముఖ్యంగా ప్రజెంట్ ట్రెండింగ్ అయిన క్రైమ్ థ్రిల్లర్ జానర్ కావడంతో ఈ మూవీకి డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ పై సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది.

OTT Movie: అమ్మాయిలకు మంకీ మాస్క్ పెట్టి హతమార్చే సైకో కిల్లర్.. ఓటీటీలో ఈ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
Varun Sandesh Constable Movie
Basha Shek
|

Updated on: Feb 04, 2026 | 8:05 PM

Share

గత వారం పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన చిత్రాలు, సిరీస్ లు ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేస్తున్నాయి. ఇక ఓటీటీ అంటే అన్ని జానర్ల కు సంబంధించిన కంటెంట్ ఉంటుంది. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్, హారర్, లవ్, కామెడీ.. ఇలా అన్ని జానర్ల సినిమాలు ఉంటాయి. అయితే ప్రజెంట్ మాత్రం క్రైమ్, హారర్, థ్రిల్లర్ సినిమాలదే హవా. ముఖ్యంగా ఓటీటీలో ఈ జానర్ సినిమాలకు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. అలా గత వారం రిలీజైన ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి ఓటీటీలో సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. గతేడాది థియేటర్లలో రిలీజైన ఈ సినిమా కంటెంట్ పరంగా ప్రశంసలు అందుకుంది. అయితే తక్కువ ప్రమోషన్స్, ఇతర కారణాలతో ఈ మూవీ ఎక్కువ రోజులు థియేటర్లలో ఆడలేకపోయింది. అయినా ఈ మూవీకి ఐఎమ్‌డీబీలో పదికి ఏకంగా 8.2 రేటింగ్ రావడం విశేషం. ఇక గత వారమే ఓటీటీలో వచ్చిన ఈ సినిమా టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది.

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఒక పల్లెటూరిలో వరుసగా హత్యలు జరుగుతాయి. అమ్మాయిలను టార్గెట్ గా చేసుకున్న ఓ సైకో కిల్లర్ వారిని దారుణంగా హతమారుస్తుంటాడు. అంతేకాదు హత్య తర్వాత మృతుల తలలకు మంకీ మాస్క్ పెడుతుంటాడు కిల్లర్. అలా ఒక రోజు హీరో మేనకోడలు కీర్తి డెడ్ బాడీ కూడా పొలిమేరలో కనిపిస్తుంది.దీంతో స్వయంగా హీరోనే ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు. ఈ క్రమంలో అతనికి సంచలన విషయాలు తెలుస్తాయి. మరి ఈ హత్యలు ఎవరు చేస్తున్నారు?, ఎందుకు చేస్తున్నారు? హత్య చేసి తలలకు మంకీ మాస్క్ పెట్టడానికి గల కారణాలు ఏంటీ? సాధారణ కానిస్టేబుల్ అయిన హీరో ఈ హత్యలను ఆపగలిగాడా? లేదా? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

క్రైమ్, ఇన్వెస్టిగేషన్, సస్పెన్స్ అంశాలతో సాగే ఈ సినిమా పేరు కానిస్టేబుల్. వరుణ్ సందేశ్ హీరోగా నటించాడు. మధులిక వారణాసి హీరోయిన్‌గా చేసింది. అలాగే మురళిధర్ గౌడ్, పుష్ప ఫేమ్ కల్ప లత, రవి వర్మ, సూర్య, నిత్య శ్రీ, కశిష్ రాజ్‌పుత్ తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. ప్రస్తుతం ఈ సినిమా ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మంచి ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ చూడాలనుకునేవారికి కానిస్టేబుల్ ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.

ఈటీవీ విన్ లో కానిస్టేబుల్ స్ట్రీమింగ్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us
గుడ్లు, చికెన్, పాల ధరలు ఎందుకు పెరుగుతున్నాయో తెలుసా? కారణం ఇదే!
గుడ్లు, చికెన్, పాల ధరలు ఎందుకు పెరుగుతున్నాయో తెలుసా? కారణం ఇదే!
రోజును బట్టి దీపంలో ఇవి వేయండి.. ఇంట్లో శుభం, ఐశ్వర్యం పెరుగుతాయట
రోజును బట్టి దీపంలో ఇవి వేయండి.. ఇంట్లో శుభం, ఐశ్వర్యం పెరుగుతాయట
ప్రపంచంలోనే అత్యంత సన్నని కారు ఇదే..!
ప్రపంచంలోనే అత్యంత సన్నని కారు ఇదే..!
కుజుడు, గురువు అనుగ్రహం.. ఆ రాశులకు నీచభంగ రాజయోగం!
కుజుడు, గురువు అనుగ్రహం.. ఆ రాశులకు నీచభంగ రాజయోగం!
అక్కడ 600 వసతిగృహాలకు ఒకటే తాళం.. సిబ్బంది, వంటవాళ్లు ఉండరు..!
అక్కడ 600 వసతిగృహాలకు ఒకటే తాళం.. సిబ్బంది, వంటవాళ్లు ఉండరు..!
సికింద్రాబాద్ - విశాఖ వెళ్లే ప్రయాణికులు బిగ్‌ అలర్ట్
సికింద్రాబాద్ - విశాఖ వెళ్లే ప్రయాణికులు బిగ్‌ అలర్ట్
యాక్టర్స్ లైఫ్ అంతేనా.. చివరకు ఆమె చనిపోయినప్పుడు బాడీకి తల లేదు.
యాక్టర్స్ లైఫ్ అంతేనా.. చివరకు ఆమె చనిపోయినప్పుడు బాడీకి తల లేదు.
శని అనుగ్రహం ఉన్న నక్షత్రాలు ఇవే.. ఈ నక్షత్రాల వారికి తిరుగేలేదట
శని అనుగ్రహం ఉన్న నక్షత్రాలు ఇవే.. ఈ నక్షత్రాల వారికి తిరుగేలేదట
వంతార నుంచి కొల్హాపూర్‌కు తిరిగొచ్చిన ఏనుగు మాధురి
వంతార నుంచి కొల్హాపూర్‌కు తిరిగొచ్చిన ఏనుగు మాధురి
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. 75 ఏళ్ల వృద్ధుడి అరెస్ట్
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. 75 ఏళ్ల వృద్ధుడి అరెస్ట్