Cinema: బాక్సాఫీస్ వద్ద సంచలనం.. ఓటీటీలో దుమ్మురేపే సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..

ఈ ఏడాది విడుదలైన చిన్న చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మాట్లాడుకుంటున్న సినిమా 2025లో రిలీజ్ అయిన అద్భుతమైన చిత్రాల్లో ఇది ఒకటి. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఈ సినిమా ఓటీటీలో దుమ్మురేపేందుకు రెడీ అయ్యింది. ఇంతకీ ఈ సినిమా ఏంటో తెలుసా..

Cinema: బాక్సాఫీస్ వద్ద సంచలనం.. ఓటీటీలో దుమ్మురేపే సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..
Jarann Movie

Updated on: Aug 02, 2025 | 11:43 AM

ప్రతి ఏడాది కొత్త కొత్త సినిమాలు రికార్డ్స్ సృష్టిస్తుంటాయి. భాషతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద సంచలనం క్రియేట్ చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. ప్రస్తుతం మహావతార్ నరసింహ సినిమా రికార్డ్ కొల్లగొడుతుంది. ఐదు రోజుల్లోనే రూ.30 కోట్లకు పైగా వసూల్లు రాబట్టాయి. తాజాగా మరో సినిమా ఓటీటీలో దుమ్మురేపుతుంది. 2025 లో విడుదలైన అలాంటి గొప్ప చిత్రం ‘జారన్’. ఈ చిత్రం ప్రేక్షకులను భయపెట్టడమే కాకుండా, భిన్నమైన, ఊహించని కథను పరిచయం చేసింది. ఇందులో అమృత సుభాష్, అనితా డేట్ ప్రధాన పాత్రలు పోషించారు.

ఇవి కూడా చదవండి.. ఒక్క యాడ్‏తో ఫేమస్ అయ్యింది.. హీరోయిన్లకు మించిన క్రేజ్.. ఈ అమ్మడు ఇప్పుడేలా ఉందో తెలుసా.. ?

జారన్ హారర్ సినిమా కాదు.. ఒక తల్లి మానసిక పోరాటం. ఏ పరిస్థితిలోనైనా తన కూతురిని కాపాడుకోవడానికి ఒక తల్లి ఎంత కష్టపడుతుంది అనేది ఈ సినిమాతో చూపించారు. డైరెక్టర్ హృషికేష్ గుప్తే ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. మానవ భావోద్వేగాల, సంబంధాలను ఆకట్టుకుంటుంది. చిన్ననాటి గాయంతో బాధపడుతున్న తల్లి పాత్రను అమృత సుభాష్ పోషించారు.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి.. Megastar Chiranjeevi: చిరంజీవికి ప్రియురాలిగా, భార్యగా, తల్లిగా, చెల్లిగా నటించిన హీరోయిన్..

ఈ సినిమా ఆగస్ట్ 8 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ కానుంది. దర్శకుడు అనీస్ బాజ్మీ నిర్మించిన, హృషికేష్ గుప్తే రచన, దర్శకత్వం వహించిన జారన్ చిత్రం. గతంలోని కొన్ని కలతపెట్టే సంఘటనల ప్రభావం వారి వర్తమానంలో ఎలా కనిపిస్తుంది అనేది ఈ సినిమాలో చూపించారు.

ఇవి కూడా చదవండి.. OTT Movie: బాబోయ్.. ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న థ్రిల్లర్ సినిమాలు.. ఊహకు అందని ట్విస్టులు..