AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : డ్యాన్సుతో భయపెట్టే దెయ్యాలు.. ఓటీటీలోకి వచ్చిన హారర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్..

ప్రస్తుతం ఓటీటీల్లో మలయాళీ చిత్రాలకు విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద విపరీతమైన రెస్పాన్స్ అందుకున్న చిత్రాలు ఇప్పుడు ఓటీటీ సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ సూపర్ హిట్ సినిమా అడియన్స్ ముందుకు వచ్చేసింది. హారర్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ పై సందడి చేస్తుంది.

Cinema : డ్యాన్సుతో భయపెట్టే దెయ్యాలు.. ఓటీటీలోకి వచ్చిన హారర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్..
Karakkam Movie
Rajitha Chanti
|

Updated on: Jul 04, 2026 | 8:54 AM

Share

మలయాళ చిత్రాలకు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విభిన్నమైన కథాంశాలు, సహజమైన మేకింగ్‌తో ఆకట్టుకునే మాలీవుడ్ సినిమాలు ఓటీటీలో బాగా దూసుకుపోతుంటాయి. కొన్ని రోజులుగా మలయాళీ సినిమాలో ఓటీటీలో సూపర్ హిట్ రెస్పాన్స్ అందుకుంటున్నాయి. ఊహించని ట్విస్టులు, సస్పెన్స్, మలుపులతో సాగే సినిమాలు చూసేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నాయి. అందుకే ఇప్పుడు మీకోసం ఒక సినిమాను పట్టుకోచ్చాం. ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి గుర్తింపు తెచ్చుకున్న సరికొత్త మలయాళ మ్యూజికల్ హారర్ కామెడీ డ్రామా ‘కరక్కం’ (Karakkam) ఇప్పుడు ఓటీటీ వేదికగా డిజిటల్ ఆడియన్స్‌ను అలరించడానికి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్ (Sony LIV) లో ఈ సినిమా జూలై 3 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా అందుబాటులో ఉంది.

ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: ఆ హీరోలాంటి మనిషి ఇంకొకరు ఉండరు.. పద్మ శ్రీ వచ్చిందని తెలిసి ఏమన్నారంటే.. మురళి మోహన్..

కథ విషయానికి వస్తే..

ఈ సినిమా కథ అంతా ధనుష్, ఖాజా అనే ఇద్దరు జులాయి స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. ఒక న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా వీరిద్దరూ విపరీతంగా మద్యం సేవించి, హాస్టల్‌లో గొడవ పడతారు. ఆ మత్తులో తాము ఏం చేస్తున్నామో తెలియని స్థితిలో, స్థానిక చర్చి శ్మశానవాటికలోకి ప్రవేశిస్తారు. అక్కడ వేర్వేరు సమాధులపై ఉన్న ఐదు ఇత్తడి సిలువలను పెకిలిస్తారు. పవిత్రమైన ఆ స్థలాన్ని అగౌరవపరచడంతో, అక్కడ నిద్రిస్తున్న ఐదు అశాంతి ఆత్మలు మేల్కొంటాయి. అగ్రహించిన ఆ దెయ్యాలు ఈ ఇద్దరు మిత్రులను వెంటాడటం ప్రారంభిస్తాయి. అయితే ఇవి మామూలు దెయ్యాలు కావు, మ్యూజిక్‌కు తగినట్లుగా డ్యాన్స్ చేసే ‘మ్యూజికల్ దెయ్యాలు’. ఆ అతీంద్రియ శక్తుల బారి నుంచి తప్పించుకోవడానికి ధనుష్, ఖాజా ఒక లోకల్ లాడ్జ్‌లో ఆశ్రయం పొందుతారు. ఆ లాడ్జ్ నేపథ్యంలో జరిగే భయానక, నవ్వులు పూయించే సంఘటనలు, ఆ తర్వాత వారు తమ తప్పును తెలుసుకుని ఆ ఆత్మలకు ఎలా విముక్తి కలిగించారనేదే ఈ సినిమా కథ.

ఎక్కువ మంది చదివినవి : Arundhati Movie: అరుంధతి సినిమాను రిజెక్ట్ చేసి తప్పు చేశాను.. అతడు మాటలు విని వదిలేశా.. టాలీవుడ్ హీరోయిన్..

శ్రీనాథ్ భాసి, ఫెమినా జార్జ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సుభాష్ లలిత సుబ్రహ్మణ్యన్ దర్శకత్వం వహించారు. ‘ఖైదీ’, ‘విక్రమ్ వేద’ చిత్రాలతో పాపులర్ అయిన శ్యామ్ సీఎస్ (Sam CS) ఈ సినిమాకు అద్భుతమైన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. భయం, కామెడీతో పాటు సరికొత్త మ్యూజికల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి ఐఎమ్‌బీ (IMDb) లో 10కి 8.3 రేటింగ్ రావడం విశేషం. వీకెండ్‌లో సరదాగా, కాస్త భయపడుతూ నవ్వుకోవాలనుకునే వారికి సోనీ లివ్‌లో అందుబాటులో ఉన్న ‘కరక్కం’ ఒక మంచి ఛాయిస్.

ఎక్కువ మంది చదివినవి :  Sunil: ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే.. నా గుండెను తాకింది.. సునీల్ కామెంట్స్..

ఎక్కువ మంది చదివినవి : Tollywood: ఇంట్లోకి వెళ్లగానే సావిత్రిగారిని అలా చూసి ఏడ్చేశా.. మనిషి చిన్నగా అయిపోయి.. టాలీవుడ్ నటి కామెంట్స్..

Follow Us
ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి.. ప్రధాని మోదీ నివాళులు
ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి.. ప్రధాని మోదీ నివాళులు
కలలో మెట్లు ఎక్కుతున్నారా? దిగుతున్నారా? స్వప్న శాస్త్రం చెప్పే..
కలలో మెట్లు ఎక్కుతున్నారా? దిగుతున్నారా? స్వప్న శాస్త్రం చెప్పే..
కీళ్ళ నొప్పులు ఎంతకీ తగ్గడం లేదా? ఇవి తింటే పూర్తిగా మాయం
కీళ్ళ నొప్పులు ఎంతకీ తగ్గడం లేదా? ఇవి తింటే పూర్తిగా మాయం
శంషాబాద్ నుంచి కడప వెళ్తున్న విమానంలో కలకలం..!
శంషాబాద్ నుంచి కడప వెళ్తున్న విమానంలో కలకలం..!
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు.. వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు.. వెదర్ రిపోర్ట్
ఉడకబెట్టిన గుడ్లు ఎంతసేపు బయట ఉంచవచ్చు? నిపుణుల సూచనలు!
ఉడకబెట్టిన గుడ్లు ఎంతసేపు బయట ఉంచవచ్చు? నిపుణుల సూచనలు!
గుండె వేగం, నిద్ర.. వెల్‌నెస్ బ్యాండ్ ప్రత్యేకతలు ఇవే
గుండె వేగం, నిద్ర.. వెల్‌నెస్ బ్యాండ్ ప్రత్యేకతలు ఇవే
అంకిత భకత్‌, కీర్తి, కుంకుమ్‌ దుమ్మురేపారు.. భారత్‌కు మరో గోల్డ్
అంకిత భకత్‌, కీర్తి, కుంకుమ్‌ దుమ్మురేపారు.. భారత్‌కు మరో గోల్డ్
అడ్వెంచర్ స్కూటర్ కోసం ఎదురుచూస్తున్న వారికి షాక్
అడ్వెంచర్ స్కూటర్ కోసం ఎదురుచూస్తున్న వారికి షాక్
అల్ట్రా వయోలెట్ షాక్వేవ్ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ ఎప్పుడు?
అల్ట్రా వయోలెట్ షాక్వేవ్ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ ఎప్పుడు?