
ఓటీటీలో ప్రతి వారం కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు వస్తుటాయి. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ.. ఇలా ఎన్నో భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు కూడా తెలుగులోకి అనువాదమవుతుంటాయి. అలా ఒక తమిళ వెబ్ సిరీస్ ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ జానర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్ తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లోనూ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఐఎమ్ డీబీలోనూఈ సిరీస్ కు 8.2 రేటింగ్ దక్కడం విశేషం. స్టోరీ విషయానికి వస్తే.. ఒక చిన్న పట్టణంలో పని చేసే కోట్టై కరుప్పుసామి అనే అమాయకపు కానిస్టేబుల్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కింది స్థాయి సిబ్బంది పరిస్థితి ఎలా ఉంటుందో ఈ సిరీస్ లో కళ్లకు కట్టినట్లు చూపించారు. అలా కరుప్పు స్వామి కూడా పై స్థాయి అధికారుల నుంచి ప్రతిరోజూ తీవ్రమైన అవమానాలు, వేధింపులు ఎదుర్కొంటాడు. అయితే ఒకానొక టైంలో అతని ఓపిక కట్టలు తెంచుకుంటుంది. అప్పటిదాకా తన లోపల అణచి పెట్టుకున్న కోపం, పగను బయటకు తీస్తాడు. డిపార్ట్‌మెంట్‌లో మూలన పడేసిన, పెండింగ్‌లో ఉన్న పాత ఫైళ్లను బయటకు తీస్తాడు. ఒక్కొక్క కేసును తనదైన శైలిలో విచారిస్తాడు. ఇదే క్రమంలో నేరస్థుల పట్ల అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తాడు. దీంతో అతనిని చూసి జనాలతో పాటు పోలసులు కూడా భయంతో వణికిపోతారు. ఇదే క్రమంలో పోలీస్ స్టేషన్ లో ఒక లాకప్ డెత్ జరుగుతుంది. ఇది కరుప్పు స్వామి జీవితంతో పాటు మొత్తం పోలీస్ వ్యవస్థను కుదిపేస్తుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.
ఈ హై-వోల్టేజ్ తమిళ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరే ‘వారెంట్’. గతంలో ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘విలంగు’ (2022) అనే సూపర్ హిట్ సిరీస్ కు సీక్వెల్ గా ఈ సిరీస్ తెరకెక్కింది. ప్రశాంత్ పాండియరాజ్ ఈ సిరీస్ కు క్రియేటర్ గా వ్యవహరించగా, విగ్నేష్ నటరాజన్ దర్శకత్వం వహించాడు. ఈ సిరీస్ లో కరుప్పుసామిగా ప్రశాంత్ పాండియరాజ్ నటి బాలాజీ శక్తివేల్, కాళీ వెంకట్, అరుళ్ దాస్, నమ్రిత తదితరులు కీలక పాత్రలు పోషించారు. సామ్ సి.ఎస్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సిరీస్ ను నెక్ట్స్ లెవెల్ తీసుకెళ్లిందని చెప్పవచ్చు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, ఇతర దక్షిణాది భాషల్లో కూడా ఇది అందుబాటులో ఉంది. ఓటీటీలో మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమా కానీ వెబ్ సిరీస్ చూడాలనుకునే వారికి ఇదొక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.
An intense police drama elevated by strong writing❤️🔥
From the world of Vilangu – Warrant is now streaming on Tamil ZEE5!@p_santh @vickyjmc @SamCSmusic #ArAshokKumar #RRamar @Madan2791 #SivanPictures #BalajiSakthivel #Kousalya #Namrithamv #Aruljothi @ActorChayadevi @kaaliactor… pic.twitter.com/hSkmmxoASu
— ZEE5 Tamil (@ZEE5Tamil) May 25, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.