
మేమ్ ఫేమస్, గోదారి గట్టుపైన వంటి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్లతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సుమంత్ ప్రభాస్. ముఖ్యంగా తన దైన యాస, యాక్టింగ్ తో యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడీ యంగ్ హీరో. ఇప్పుడతను నటించిన మరో సినిమా ‘రోమాంచకం’. మ్యాడ్, 8 వసంతాలు సినిమాలతో ఫేమస్ అయిన అనంతిక సనీల్ కుమార్ ఈ మూవీలో హీరోయిన్ గా నటించింది. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను నిర్మించడం విశేషం. రొమాంటిక్ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఈ నెల 3న థియేటర్లలో రిలీజైంది. అయితే ఆడియెన్స్ ను పెద్దగా ఆకట్టుకోలేకపోయిందీ సినిమా. ఉన్నంతలో యూత్ ఈ సినిమాను బాగా చూశారు. థియేటర్లలో నుంచి త్వరగానే వెళ్లిపోయిన రోమాంచకం సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చింది. రోమాంచకం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 01 నుంచే ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులోకి రానుంది.
రోమాంచకం సినిమా స్టోరీ విషయానికి వస్తే.. కాలేజీ చదువు పూర్తి చేసిన అన్వేష్(సుమంత్ ప్రభాస్) స్నేహితులతో కలిసి స్టార్టప్ ప్రారంభించాలనుకుంటాడు. అందులో భాగంగానే ఒక డేటింగ్ యాప్ తయారు చేసే ప్రయత్నం చేస్తాడు. అదే సమయంలోనే మైథిలి (అనంతిక) తో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఒకరోజు మైథిలిని కలవడానికి చెన్నై వెళతాడు అన్వేష్. అయితే అక్కడే హీరో కు అనుకోని షాక్ ఎదురవుతుంది. మైథిలి అన్వేషణను బ్లాక్ చేయడంతో పాటు కనిపించకుండా వెళుతుంది. మరి మైథిలికి ఏమైంది? ఆమె కనిపించకుండా పోవడం వెనుక గల కారణం ఏంటి? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
Startup Anvesh doesn’t need a cupid, he has his own dating app 😎 pic.twitter.com/HN2T662Rgb
— Netflix India South (@Netflix_INSouth) September 28, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.