OTT Movie: అమ్మాయిలు కచ్చితంగా చూడాల్సిన మూవీ.. OTTలో వచ్చేసిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్.. IMDB టాప్ రేటింగ్ మూవీ

టాక్సిక్ బాయ్ ఫ్రెండ్స్/ లవర్స్ ఉన్న అమ్మాయిల జీవితం ఎలా ఉంటుంది? పర్సనల్‌గా.. ప్రొఫెషనల్‌గా వారు ఎలా ఇబ్బంది పడుతున్నారన్న విషయాలను ఈ సినిమాలో చక్కగా చూపించారు. అందుకే చాలా మంది అమ్మాయిలు ఈ డిఫరెంట్ మూవీని బాగా ఓన్ చేసుకున్నారు.

OTT Movie: అమ్మాయిలు కచ్చితంగా చూడాల్సిన మూవీ.. OTTలో వచ్చేసిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్.. IMDB టాప్ రేటింగ్ మూవీ
The Girlfriend Movie

Updated on: Dec 05, 2025 | 6:42 AM

నేషనల్ క్రష్ రష్మిక మందన్నాఇప్పుడు ఇండియాలోనే ది మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ప్రస్తుతం ఆమె స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ మూవీస్ తోనూ మెప్పిస్తోంది. అలా రష్మిక నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ’ ది గర్ల్ ఫ్రెండ్’. అందాల రాక్షసి సినిమాతో హీరోగా మెప్పించి, చి ల సౌ సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ఈ ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కించాడు. రష్మిక సరసన దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి నటించాడు. నవంబర్ 07న థియేటర్లలో విడుదలైన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి న ఈ సినిమా రూ. 28 కోట్లకు పైగానే కలెక్షన్లు సాధించింది. టాక్సిక్ బాయ్ ఫ్రెండ్స్ /లవర్స్ ఉన్న అమ్మాయిలు పర్సనల్‌గా.. ప్రొఫెషనల్‌గా ఎలా ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని ఈ సినిమాలో చక్కగా చూపించారు డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్. దీంతో చాలా మంది అమ్మాయిలు ది గర్ల్ ఫ్రెండ్ సినిమాను ఓన్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాను చూసిన అమ్మాయిలు బాగా ఎమోషనల్ అయ్యారు.

థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమాను ఓటీటీలోనూ చూడాలని చాలా మంది ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పుడు వారి కోరిక నెరవేరింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో శుక్రవారం (డిసెంబర్ 05) అర్ధరాత్రి నుంచే ది గర్ల్ ఫ్రెండ్ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ మూవీతెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసిన రష్మిక సినిమా

ది గర్ల్ ఫ్రెండ్ సినిమాను గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌ సమర్పణలో ధీరజ్‌ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు. అను ఇమ్మాన్యుయేల్, రావు రమేశ్, రోహిణీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి