AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓటీటీలోకి వచ్చేసిన జానకి V v/s స్టేట్ ఆఫ్ కేరళ.. తెలుగు వర్షన్ ఎప్పటినుంచంటే

దక్షిణాది చిత్రపరిశ్రమలో అత్యధిక ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఈ అమ్మడు. అద్భుతమైన నటనతో తెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. తనే హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్.

ఓటీటీలోకి వచ్చేసిన జానకి V v/s స్టేట్ ఆఫ్ కేరళ.. తెలుగు వర్షన్ ఎప్పటినుంచంటే
Jsk
Rajeev Rayala
|

Updated on: Aug 22, 2025 | 10:37 AM

Share

భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT ప్లాట్‌ఫారమ్ అయిన ZEE5 2025లో మరో సూపర్‌హిట్ ప్రీమియర్‌తో ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. సంక్రాంతికి వస్తున్నం, రాబిన్‌హుడ్, భైరవం వంటి వరుస తెలుగు సూపర్‌హిట్‌లను అందించిన తర్వాత ZEE5 తెలుగు ఇప్పుడు మరో అద్భుతమైన సినిమాను అందించబోతోంది. విమర్శకుల ప్రశంసలు పొందిన మాలీవుడ్ లీగల్ డ్రామా ‘J.S.K – జానకి V v/s స్టేట్ ఆఫ్ కేరళ’ ఆగస్టు 22న తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఇప్పటికే తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో సక్సెస్ ఫుల్ గా స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే.

6 ఏళ్ల వయసులోనే ఎంట్రీ.. అవకాశాలు లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.. ఇప్పుడు ఆమె టాప్ సింగర్

సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన J.S.K మూవీకి ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహించగా.. కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై J. ఫణీంద్ర కుమార్ నిర్మించారు. ప్రఖ్యాత న్యాయవాది డేవిడ్ అబెల్ డోనోవన్ (సురేష్ గోపి) సహాయంతో లైంగిక వేధింపుల నుండి బయటపడిన జానకి విద్యాధరన్ (అనుపమ పరమేశ్వరన్) చుట్టూ ఈ కథ తిరుగుతుంది. న్యాయం కోసం పోరాడుతున్న ఓ యువతి, న్యాయవాది చివరకు గెలిచారా? లేదా? అసలు జానకి జీవితంలో ఏం జరిగింది? న్యాయం కోసం చేయాల్సి వచ్చిన పోరాటం ఏంటి? అనే ప్రశ్నల్ని లేవనెత్తేలా ట్రైలర్‌ను కట్ చేశారు.

ఇదేంది మావ..! ఈ క్రేజీ బ్యూటీ కిక్ సినిమా డాక్టరా..!! అస్సలు ఊహించలేరు

ఈ చిత్రంలో గిరీష్ నారాయణన్ స్వరపరిచిన పాటలు, గిబ్రాన్ అద్భుతమైన నేపథ్య సంగీతం స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయి. ఈ చిత్రానికి రెనదివే సినిమాటోగ్రఫీ అందించారు. ఈ ఆగస్టు 22న ‘J.S.K – జానకి V vs. స్టేట్ ఆఫ్ కేరళ’ తెలుగు లో ప్రత్యేక డిజిటల్ ప్రీమియర్‌ను ZEE5లో మాత్రమే చూడండి. ఈ వీకెండ్‌ను ఉత్కంఠభరితమైన కోర్టు డ్రామాతో ఎంజాయ్ చేయండి.

ఇవి కూడా చదవండి

మార్షల్ ఆర్ట్స్‌లో తోప్.. కట్ చేస్తే ఇప్పుడు ఇండస్ట్రీలోనే హాట్ బ్యూటీ.. గ్లామరస్‌కు కేరాఫ్ అడ్రస్ ఈ అమ్మడు

జీ5 భార‌త‌దేశ‌పు యంగ‌స్ట్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్. మల్టీలింగ్వుల్ స్టోరీటెల్ల‌ర్‌గా ప్ర‌సిద్ధి పొందింది. మిలియ‌న్ల కొద్దీ అభిమానుల‌ను సంపాదించుకుంది. గ్లోబ‌ల్ కంటెంట్ ప‌వ‌ర్ హౌస్ జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఎంట‌ర్‌ప్రైజెస్ లిమిటెడ్ (జీఎల్‌) నుంచి శాఖ‌గా మొద‌లైంది జీ5. అత్య‌ద్భుత‌మైన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ గా పేరు తెచ్చుకుంది. 3,500 సినిమాల లైబ్ర‌రీ ఉన్న ప్లాట్‌ఫార్మ్ ఇది. 1,750 టీవీ షోలు, 700 ఒరిజిన‌ల్స్, 5 ల‌క్ష‌ల‌కు పైగా ఆన్ డిమాండ్ కంటెంట్ ఈ సంస్థ సొంతం. 12 భాష‌ల్లో (హిందీ, ఇంగ్లిష్‌, బెంగాలీ, మ‌ల‌యాళం, తెలుగు, త‌మిళ్‌, మ‌రాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజ‌రాతీ, పంజాబీ)లో అందుబాటులో ఉంది. బెస్ట్ ఒరిజిన‌ల్స్, ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీస్‌, టీవీ షోస్‌, మ్యూజిక్‌, కిడ్స్ షోస్‌, ఎడ్‌టెక్‌, సినీ ప్లేస్‌, న్యూస్‌, లైవ్ టీవీ, హెల్త్, లైఫ్‌స్టైల్ విభాగాల్లో ప్రేక్ష‌కుల‌ను రంజింప‌జేస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఆర్టీసీ బస్సులో సీటు కోసం జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు!
ఆర్టీసీ బస్సులో సీటు కోసం జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు!
మోమోస్, నూడుల్స్ ప్రసాదంగా ఇచ్చే కాళీ ఆలయం.. ఈ దేవాలయం విశేషాలు..
మోమోస్, నూడుల్స్ ప్రసాదంగా ఇచ్చే కాళీ ఆలయం.. ఈ దేవాలయం విశేషాలు..
రేవంత్‌ అండ్ కిషన్‌..! సింగిల్ ఫ్రేమ్‌... డబుల్ ఎజెండా?
రేవంత్‌ అండ్ కిషన్‌..! సింగిల్ ఫ్రేమ్‌... డబుల్ ఎజెండా?
జూలైలో శక్తివంతమైన వ్యతీపాత యోగం.. ఈ 4 రాశుల వారికి ధనలాభం, విజయం
జూలైలో శక్తివంతమైన వ్యతీపాత యోగం.. ఈ 4 రాశుల వారికి ధనలాభం, విజయం
భారత్-పాక్ సరిహద్దుల్లో అర్ధరాత్రి హైడ్రామా!
భారత్-పాక్ సరిహద్దుల్లో అర్ధరాత్రి హైడ్రామా!
ఎండిపోతున్న మనీ ప్లాంట్‌కు జీవం పోసే సూపర్ కిచెన్ చిట్కాలు..
ఎండిపోతున్న మనీ ప్లాంట్‌కు జీవం పోసే సూపర్ కిచెన్ చిట్కాలు..
ఇవాళే OTTలోకి వచ్చేసిన బాక్సాఫీస్ సెన్సేషన్.. తెలుగులోనూ చూడొచ్చు
ఇవాళే OTTలోకి వచ్చేసిన బాక్సాఫీస్ సెన్సేషన్.. తెలుగులోనూ చూడొచ్చు
ఏలినాటి శని కారణంగా జూలైలో వీరికి వాయింపే వాయింపు..
ఏలినాటి శని కారణంగా జూలైలో వీరికి వాయింపే వాయింపు..
జాతకంలో శంఖ యోగం ఉందా? అయితే గౌరవం, సంపద, విజయాలు మీ సొంతమే!
జాతకంలో శంఖ యోగం ఉందా? అయితే గౌరవం, సంపద, విజయాలు మీ సొంతమే!
మార్కెట్ వద్దు.. ఇంటి పెరట్లోనే తియ్యటి ఆర్గానిక్‌ బీట్‌రూట్..
మార్కెట్ వద్దు.. ఇంటి పెరట్లోనే తియ్యటి ఆర్గానిక్‌ బీట్‌రూట్..