OTT Movie: 3 కోట్లతో తీస్తే 60 కోట్లు.. ఓటీటీలో మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

ప్రస్తుతం మలయాళం సినిమాలు, వెబ్ సిరీస్ లకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఓటీటీలో ఈ మాలీవుడ్ సినిమాలకు ఓ రేంజ్ లో క్రేజ్ ఉంది. అందులోనూ హారర్, సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలనైతే ఎగబడి చూస్తున్నారు ఆడియెన్స్.

OTT Movie: 3 కోట్లతో తీస్తే 60 కోట్లు.. ఓటీటీలో మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
Ott Movie

Updated on: Oct 05, 2026 | 6:48 AM

మలయాళ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, ఊహించని ట్విస్టులతో సాగే ఈ మలయాళ చిత్రాలను ఓటీటీ ప్రియులు ఎంతో ఆసక్తిగా తిలకిస్తుంటారు. ముఖ్యంగా తెలుగు ఆడియెన్స్ అయితే ఎగబడి ఈ సినిమాలను చూస్తుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమానే. కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. కేవలం రూ. 3 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ.60 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఐఎమ్ డీబీలోనూ ఈ సినిమాకు 7.8 రేటింగ్ లభించడం విశేషం. ఈ సినిమా స్టోరీ కూడా చాలా కొత్తగా ఉంటుంది. కారుణ్య నియామకం కింద పోలీస్‌ ఉద్యోగం సంపాదించిన అలీనా అబ్రహాం (పార్వతి తిరువోతు) చుట్టూ ఈ కథ సాగుతుంది. ఓ పోలీస్‌ స్టేషన్‌లో రాత్రి విధులు నిర్వహిస్తున్న కొందరు పోలీసుల చేతుల్లో అనుకోకుండా ఓ నేరం జరుగుతుంది. అయితే నేరాన్ని బయటకు రాకుండా చేసేందుకు అదే పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన వారు తమకున్న తెలివితేటలను, పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటారు. క్రైమ్‌ సీన్‌ గురించి, పోలీస్‌ శాఖలోని విధివిధానాల గురించి పూర్తిగా తెలిసిన వారు కావడంతో.. ఆధారాలు దొరకకుండా నేరాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తారు. మరోవైపు ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీనియర్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ అధికారి (విజయరాఘవన్‌) చేపడతారు. దీంతో నేరానికి పాల్పడిన పోలీసులకు, దర్యాప్తు అధికారికి మధ్య మైండ్ గేమ్ నడుస్తుంది? మరి ఎవరికి తెలియకుండా చేసిన నేరాన్ని పోలీసులు ఎలా దాచారు? విజయరాఘవన్‌ వారికి ఎలా చెక్‌ పెట్టారు? చివరికి అసలు నిజం ఎలా బయటపడింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఈ మలయాళం సినిమా పేరు ‘ప్రథమ దృష్ట్యా కుట్టక్కర్’ (Pradhama Drishtya Kuttakkar). మలయాళంలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అ యిన షహద్ నీలాంబూర్ ఈ సినిమాను తెరకెక్కించాడు. పార్వతి తిరువోతు, మాథ్యూ థామస్, విజయరాఘవన్, వినయ్ ఫోర్ట్, సిద్ధార్థ్ భరతన్, ఉన్నిమాయ ప్రసాద్, అజీజ్ నెడుమంగాడ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 11 ఐకాన్స్ ఫిలిం ప్రొడక్షన్స్ పతాకంపై అర్జున్ సెల్వా నిర్మించిన ఈ సినిమాకు పి.ఎస్. సుబ్రమణియన్, విజేష్ తోట్టింగల్ స్క్రిప్ట్ అందించారు. ముజీబ్ మజీద్ నేపథ్యం సంగీతం సమకూర్చారు. థియేటర్లలో సంచలన విజయం సాధించిన ‘ప్రథమ దృష్ట్యా కుట్టక్కర్’ ఈ శుక్రవారం (అక్టోబర్ 05) నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us