Telugu News Entertainment Ott New Movies And Web Series To Stream On Various OTT Platforms On December 8th Telugu Cinema News
OTT Movies: ఓటీటీల్లో మూవీ ఫెస్టివల్.. శుక్రవారం 30కు పైగా సినిమాల స్ట్రీమింగ్.. ఫుల్ లిస్ట్ ఇదే
థియేటర్లలో ఇంకా యానివల్ హవా కొనసాగుతోంది. అయినా తగ్గేదేలేదంటూ 'హాయ్ నాన్న' అంటూ వచ్చేశాడు నాని. ఇక నితిన్ 'ఎక్స్ ట్రా' మూవీ కూడా థియేటర్లలో విడుదల కానుంది. ఈ రెండు సినిమాలు తప్పితే ఈ వారం పెద్దగా సినిమాలేవి లేవు. అయితే ఓటీటీల్లో మాత్రం ఎంటర్‌టైన్మెంట్ ఏ మాత్రం ఢోకా లేదు. ఏకంగా 30కు పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రానున్నాయి.
థియేటర్లలో ఇంకా యానివల్ హవా కొనసాగుతోంది. అయినా తగ్గేదేలేదంటూ ‘హాయ్ నాన్న’ అంటూ వచ్చేశాడు నాని. ఇక నితిన్ ‘ఎక్స్ ట్రా’ మూవీ కూడా థియేటర్లలో విడుదల కానుంది. ఈ రెండు సినిమాలు తప్పితే ఈ వారం పెద్దగా సినిమాలేవి లేవు. అయితే ఓటీటీల్లో మాత్రం ఎంటర్‌టైన్మెంట్ ఏ మాత్రం ఢోకా లేదు. ఏకంగా 30కు పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. ఈ వారం అందరి దృష్టి రాఘవ లారెన్స్, ఎస్ జే సూర్యల జిగర్తాండ డబుల్ ఎక్స్ సినిమా మీదనే ఉంది. ఇక మా ఊరి పొలిమేర 2 ఇప్పటికే స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.అయితే ఆహా గోల్డ్ సబ్‌స్ర్కైబర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. శుక్రవారం నుంచి ఆహా యూజర్లందరికీ ఈ సినిమాను ఉచితంగా చూసే ఛాన్స్ లభించనుంది. మరి వీటితో పాటు శుక్రవారం (డిసెంబర్ 8) వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లపై ఓ లుక్కేద్దాం రండి.
నెట్‌ఫ్లిక్స్
జిగర్ తాండ డబుల్ ఎక్స్ – తెలుగు డబ్బింగ్ సినిమా
లీవ్ ద వరల్డ్ బిహైండ్ – ఇంగ్లిష్ సినిమా
అదృశ్య జలకంగళ్ – తెలుగు డబ్బింగ్ మూవీ
దక్ దక్ – హిందీ మూవీ
ద ఆర్చీస్ – హిందీ మూవీ
అనలాగ్ స్క్వాడ్ – థాయ్ సిరీస్
హై టైడ్స్ – ఇంగ్లిష్ సిరీస్
హిల్డా సీజన్ 3 – ఇంగ్లిష్ సిరీస్
ఐ హేట్ క్రిస్మస్ సీజన్ 2 – ఇటాలియన్ సిరీస్
మై లైఫ్ విత్ వాల్టర్ బాయ్స్ – ఇంగ్లిష్ సిరీస్
వరల్డ్ వార్ 2: ఫ్రమ్ ద ఫ్రంట్ లైన్స్- ఇంగ్లిష్ సిరీస్
ఫెర్మాట్స్ కూజిన్ – జపనీస్ సిరీస్
నాగా – అరబిక్ సినిమా
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
వధువు – తెలుగు వెబ్ సిరీస్
డైరీ ఆఫ్ ఏ వింపీ కిడ్ క్రిస్మస్: క్యాబిన్ ఫీవర్ – ఇంగ్లిష్ మూవీ