
హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. భాషతో సంబంధం లేకుండా భయపెట్టే కథాంశాలు, ఉత్కంఠ రేకెత్తించే ట్విస్టులతో సాగే ఈ సినిమాలకు ఇప్పుడు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా ఓటీటీలో ఈ జానర్ సినిమాలను తెగ చూసేస్తున్నారు. అలా ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్ ను భయపెట్టేందుకు మరో హారర్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఇదొక ఒడియా సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ. కొద్ది రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు ఓటీటీలోకి కూడా వచ్చేసింది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే..
సింగ్ దేవ్ అనే ఒక పాడుపడిన పాతకాలపు రాజ భవనం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. అక్కడ నివసించే స్థానికులు పొరపాటున కూడా ఎవరూ ఆ భవనం వైపు వెళ్లేందుకు కూడా సాహసించరు. ఆ ఇంట్లో దెయ్యం ఉందని, కనిపించిన వారందరినీ చంపి తినేస్తుందని వారి నమ్మకం. అలాంటి ఇంట్లోకి నివసించేందుకు అనుకోని పరిస్థితుల్లో ఒక అమ్మాయి తన అక్క, తమ్ముడితో కలిసి వెళ్తారు. అక్కడ ఉండే ఒక సీక్రెట్ బాక్స్ను అనుకోకుండా తెరుస్తారు. ఆ క్షణం నుంచే ఆ కుటుంబానికి విపత్కర పరిస్థితులు ఎదురవుతాయి. ఆ సీక్రెట్ బాక్స్ నుంచి బయటపడిన ఒక దుష్టశక్తి (దెయ్యం) ఆ అమ్మాయిని ఆవహిస్తుంది. అంతే ఆ దెయ్యం పట్టిన అమ్మాయి మనుషులను పీక్కుతినడం వంటి జుగుప్సాకరమైన పనులన్నీ చేస్తుంది. దీంతో తమ సోదరిని కాపాడుకోవడానికి ఒక పాస్టర్ సాయం తీసుకుంటారు అక్కా, తమ్ముడు. మరి దెయ్యం బారి నుంచి ఆ అమ్మాయి ఎలా బయటపడింది? ఆ రాజభవనం వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? ఫాదర్, తోబుట్టువులు కలిసి ఆ భయంకరమైన దెయ్యాన్ని ఎలా ఎదుర్కొన్నారు? అసలు ఆ దెయ్యం కథేంటీ? అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ప్రస్తుతం ఓటీటీ ఆడియెన్స్ ను భయపెడుతోన్న ఈ సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్ సినిమా పేరు ‘దహాన్: ది ఈవిల్ వితిన్’ (Dahaan : The Evil Within). ఇదొక ఒడియా సినిమా.సెప్టెంబర్ 11న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అక్కడి ఆడియెన్స్ కు చెమటలు పట్టించింది. బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధించింది. ఐఎమ్ డీబీలోనూ టాప్ రేటింగ్ తెచ్చుకున్న ఈ సినిమాకు అనుపమ్ పట్నాయక్ దర్శకత్వం వహించారు. ఔరోశిఖా మిశ్రా, బర్షా పట్నాయక్, సామ్రాట్ మహాపాత్ర, చౌదరి జయప్రకాష్ దాస్, పార్థ సారథి రే తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. అమియా పట్నాయక్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఈ సినిమాను నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.