
మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం కన్నప్ప. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ డివోషనల్ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీగానే వసూళ్లు వచ్చాయి. శివుని భక్తుడిగా మంచు విష్ణు నటన హైలెట్ గా నిలిచిందని ఆడియెన్స్ ప్రశంసలు కురిపించాడు. ఇక కనిపించేది కొద్ది సేపే అయినా రుద్ర పాత్రలో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ అదరగొట్టాడని కాంప్లిమెంట్స్ వినిపించాయి. పలువురు సినీ ప్రముఖులు కూడా కన్నప్ప సినిమాను చూసి ప్రశంసలు కురిపించారు. అలాగే రాష్ట్రపతి భవన్ లోనూ ఈ మూవీని ప్రత్యేకంగా ప్రదర్శించడం విశేషం. ఇలా ఎన్నో విశేషాలున్న ఈ కన్నప్ప సినిమాను ఓటీటీలో చూడాలని చాలామంది ఉవ్విళ్లూరుతున్నారు. ఎట్టకేలకు వీరి ఎదురు చూపులకు తెరపడనుంది. కన్నప్ప ఓటీటీ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో
సెప్టెంబర్ నాలుగో తేదీ నుంచి కన్నప్ప సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు హీరో మంచు విష్ణు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘హర హర మహాదేవ’, హర్ ఘర్ మహాదేవ’ అంటూ తన పోస్ట్ కు క్రేజీ క్యాప్షన్ ఇచ్చాడు మంచు వారబ్బాయి.
. మహా భారతం సీరియల్ ఫేమ్, బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కించిన కన్నప్ప సినిమాలో మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ శరత్ కుమార్, బ్రహ్మానందం, మధుబాల, ముఖేష్ రిషి, , యోగి బాబు, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా (విష్ణు కూతుళ్లు) ఇలా చాలా మంది నటించారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై మంచు మోహన్ బాబు, మంచు విష్ణు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.
మరి థియేటర్లలో కన్నప్ప సినిమాను మిస్ అయ్యారా? లేదా మరోసారి చూడాలనుకుంటున్నారా? అయితే మరో మూడు రోజులు ఆగండి. ఎంచెక్కా ఇంట్లోనే ఈ విజువల్ వండర్‌ను చూసి ఎంజాయ్ చేసేయండి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.