
ప్రస్తుతం మలయాళం సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలైతే మరీనూ. థియేటర్లు అయినా, ఓటీటీలయినా మలయాలం క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ కు షేక్ అవ్వాల్సిందే. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీనే. పలువురు స్టార్స్ నటించిన ఈ సినిమా గతేడాది నవంబర్ లో విడుదలైంది. ఆసక్తికరమైన కథా కథనాలు, ఉత్కంఠభరిత సన్నివేశాలు, ఊహించని ట్విస్టులతో ఈ మూవీ మలయాళం ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందించింది. బాక్సాఫీస్ వద్ద మంచి గానే వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మేరీ ఫిలిప్ అనే ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఒక క్రైమ్ షోను నడుపుతుంటుంది. ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ కోసం ఆమె ఒక ప్రమాదకరమైన నేరస్థుడిని కలవడానికి వెళ్తుంది.
తన ఇంటర్వ్యూ ద్వారా ఆమోస్ అలెగ్జాండర్ మనస్తత్వాన్ని, అతని హత్యల వెనక ఉన్న రహస్యాలను బయటపెట్టాలనుకుంటుంది మేరీ. అయితే ఇంటర్వ్యూ మొదలయ్యాక ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి. ఆమోస్ మేరీని తన మాటలతో భయ పెట్టడం ప్రారంభిస్తాడు. మరి మేరీ ఏమైంది? అసుల ఆమోస్ అలెగ్జాండర్ ఎవరు? హత్యలు ఎందుకు చేశాడన్నది తెలుసుకోవాలంటే ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ని చూడాల్సిందే.
Silent moves. Strong impact.
Stream Amoz Alexander on Sun NXT
[Amoz Alexander Malayalam movie, psychological crime thriller, investigation drama, mystery film, suspense story, Sun NXT exclusive streaming]#AmozAlexander #MalayalamMovie #CrimeThriller #MysteryUnfolds #SunNXT pic.twitter.com/VnR7tPdUs9
— SUN NXT (@sunnxt) February 23, 2026
ఈ మలయాళం థ్రిల్లర్ మూవీ పేరు ‘అమోస్ అలెగ్జాండర్’. అజు వర్గీస్, జాఫర్ ఇడుక్కి ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. దయానా హమీద్, కళాభవన్ షాజాన్, తారా జోసెఫ్ తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమా ఫిబ్రవరి 20 నుంచి సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూడాలనుకునేవారికి ఈ మూవీ ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.