OTT Movies: ఈ వారం ఓటీటీల్లో 20కు పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. ఆ మూడు చాలా స్పెషల్.. అసలు మిస్ అవ్వద్దు

ఈ వారం ఇటు థియేటర్లు, అటు ఓటీటీల్లో కొత్త సినిమాల సందడ కాస్త తగ్గిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే థియేటర్లలో ప్రస్తుతం ధురందర్ 2 ప్రభంజనం కొనసాగుతోంది. కాబట్టి ఈ వారం థియేటర్లలో పెద్ద సినిమాలేవీ రీలీజ్ కావడం లేదు. ఇక ఓటీటీలోనూ దాదాపు ఇదే పరిస్థితి.

OTT Movies: ఈ వారం ఓటీటీల్లో 20కు పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. ఆ మూడు చాలా స్పెషల్.. అసలు మిస్ అవ్వద్దు
OTT Movies

Updated on: Mar 24, 2026 | 4:52 PM

ఈ వారం కూడా థియేటర్లలో పెద్ద సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. ప్రస్తుతం థియేటర్లలో ఓ వైపు ధురంధర్ 2 ప్రభంజనం కొనసాగుతుండగా మరోవైపు నెగెటివ్ టాక్ తోనే పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మోస్తరు వసూళ్లనే రాబడుతోంది. కాబట్టి చిన్న సినిమాల సందడి ఉండనుంది. ‘కోర్ట్’ జంట నటించిన ‘బ్యాండ్ మేళం’, ప్రియదర్శి ‘సుయోధన’తో పాటు తమిళ డబ్బింగు సినిమాలైన ‘యూత్’, ‘హ్యాపీరాజ్’ సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. ఇక ఓటీటీల విషయానికి వస్తే.. సుమారు 20కు పైగా సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. వీటిలో విజయ్ సేతుపతి ‘కాట్టాన్’ వెబ్ సిరీస్ కాస్త ఇంట్రెస్ట్ కలిగిస్తోంది. అలాగే శివాజీ, లయ నటించిన సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని మూవీపై కూడా ఓ లుక్ వేసుకోవచ్చు. వీటితో పాటు బాలీవుడ్ సినిమా రాణిముఖర్జీ ‘మర్దానీ 3’ తో పాటు ఇతర భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. మరి మార్చి 4 వారంలో ఏయే ఓటీటీల్లో ఏయే సినిమాలు స్ట్రీమింగ్ కు రానున్నాయో తెలుసుకుందాం రండి.

 

నెట్‌ఫ్లిక్స్

  • ఇన్‌సైడ్ సీజన్ 3 (ఇంగ్లిష్ రియాలిటీ షో) – మార్చి 23
  • హార్ట్ బ్రేక్ హై సీజన్ 3 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – మార్చి 25
  • హోమీసైడ్ సీజన్ 3 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – మార్చి 25
  • సమ్‌థింగ్ వెరీ బ్యాడ్ ఈజ్ గోయింగ్ టూ హ్యాపెన్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – మార్చి 26
  • ద రెడ్ లైన్ (థాయ్ సినిమా) – మార్చి 26
  • డిటెక్టివ్ హోల్ (నార్వేజియన్ వెబ్ సిరీస్) – మార్చి 26
  • మర్దానీ 3 (హిందీ సినిమా) – మార్చి 27

అమెజాన్ ప్రైమ్ వీడియో

  • బెయిట్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – మార్చి 25
  • ప్రెటీ లేథల్ (ఇంగ్లిష్ సినిమా) – మార్చి 25
  • ఓ రోమియో (హిందీ సినిమా) – మార్చి 27
  • హౌస్ ఆఫ్ డేవిడ్ సీజన్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – మార్చి 27

 

ఇవి కూడా చదవండి

జియో హాట్‌స్టార్

  • ద కమ్ బ్యాక్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – మార్చి 23
  • ద హన్నా మొంటానా 20th యానివర్సరీ స్పెషల్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – మార్చి 24
  • డేర్ డెవిల్ బార్న్ ఎగైన్ సీజన్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – మార్చి 25
  • కాట్టాన్ (తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్) – మార్చి 27

జీ5

  • భానుప్రియ భూటర్ హోటల్ (బెంగాలీ సినిమా) – మార్చి 26
  • ప్రజాపతి 2 (బెంగాలీ సినిమా) – మార్చి 27
  • హే కాయ్ నవీన్ (మరాఠీ వెబ్ సిరీస్) – మార్చి 27

ఆపిల్ టీవీ

  • ఫర్ ఆల్ మ్యాన్ కైండ్ సీజన్ 5 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – మార్చి 27

ఈటీవీ విన్ ఓటీటీలో..

  • సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని- మార్చి 26

 

Note: ఇవి కాక వారం  కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ లను ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండా స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us