OTT Movies: వాలంటైన్స్ వీక్ స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లో సూపర్ హిట్ సినిమాలు.. స్ట్రీమింగ్ లిస్ట్ ఇదిగో

ఈ వారం ఓటీటీల్లో పలు సూపర్ హిట్ సినిమాలు సందడి చేయనున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మెగాస్టార్ చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు మూవీ గురించి. థియేటర్లలో రూ.400 కోట్ల మేర కలెక్షన్లు సాధించిన ఈ మూవీ ఈ వారమే ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుంది.

OTT Movies: వాలంటైన్స్ వీక్ స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లో సూపర్ హిట్ సినిమాలు.. స్ట్రీమింగ్ లిస్ట్ ఇదిగో
OTT Movies

Updated on: Feb 10, 2026 | 6:55 AM

వాలంటైన్స్ వీక్ వచ్చేసింది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఈ వారం కొన్ని ఆసక్తికర సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. విశ్వక్ సేన్ ‘ఫంకీ’తో పాటు ‘కపుల్ ఫ్రెండ్లీ’, 1+1 ఆఫర్ అనే తెలుగు సినిమాలు సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనున్నాయి. అలానే సీతా పయనం, బూకి అనే డబ్బింగ్ చిత్రాలతో పాటు లవ్ స్టోరి, మనసంతా నువ్వే వంటి సినిమాలు రీ రిలీజ్ కానున్నాయి. మరోవైపు ఓటీటీల్లోనూ సుమారు 16 వరకు కొత్త చిత్రాలు స్ట్రీమింగ్‌కి రెడీ అయిపోయాయి. సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్స్ అయిన చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’, నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ ఈ వీకెండ్ లోనే ఓటీటీలోకి అందుబాటులోకి రాబోతున్నాయి. వీటితో పాటు బేబీ గర్ల్ అనే మలయాళ డబ్బింగ్ మూవీ, ద కంజూరింగ్, ప్రిడేటర్ బ్యాడ్ ల్యాండ్ అనే హాలీవుడ్ డబ్బింగ్ సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి. మరి వాలంటైన్స్ వీక్ సందర్భంగా ఏ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందో తెలుసుకుందాం రండి .

నెట్‌ఫ్లిక్స్ లో

  • అనగనగా ఒక రాజు (తెలుగు సినిమా) – ఫిబ్రవరి 11
  • కొహ్రా సీజన్ 2 (హిందీ వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 11
  • లీడ్ చిల్డ్రన్ (పోలిష్ వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 11
  • లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 10 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 11
  • తలైవర్ తంబి తలైమయిల్ (తమిళ సినిమా) – ఫిబ్రవరి 12
  • జోస్ కాలేజ్ రోడ్ ట్రిప్ (ఇంగ్లిష్ సినిమా) – ఫిబ్రవరి 13
  • మ్యూజియమ్ ఆఫ్ ఇన్నోసెన్స్ (టర్కీష్ వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 13
  • ద ఆర్ట్ ఆఫ్ సారా (కొరియన్ వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 13

అమెజాన్ ప్రైమ్ వీడియో

ఇవి కూడా చదవండి
  • క్రాస్ సీజన్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 1

జియో హాట్‌స్టార్

  • ప్రిడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – ఫిబ్రవరి 12
  • ద కంజూరింగ్: లాస్ట్ రైట్స్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – ఫిబ్రవరి 13

జీ5

  • మన శంకరవరప్రసాద్ గారు (తెలుగు సినిమా) – ఫిబ్రవరి 11

సన్ నెక్స్ట్

  • సూర్య: పవర్ ఆఫ్ లవ్ (కన్నడ సినిమా) – ఫిబ్రవరి 13

సోనీ లివ్

  • బేబీ గర్ల్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – ఫిబ్రవరి 12

ఆపిల్ టీవీ ప్లస్

  • ఎటర్నటీ (ఇంగ్లిష్ సినిమా) – ఫిబ్రవరి 13
  • అమెజాన్ ఎమ్ఎక్స్ ప్లేయర్
  • అమర్ విశ్వాస్ (హిందీ వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 11

 

Note: ఇవి కాక వారం  కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ లను ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండా స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.