
ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన సినిమా గురించి మీకు తెలుసా. తమిళనాడులోని సుందరమైన మార్గాల్లో ఒక వృద్ధుడికి, చిన్న దొంగకు మధ్య జరిగే ప్రయాణం..ఆ తర్వాత ఇద్దరి జీవితాల్లో ఎదురయ్యే సవాళ్లు, కష్టాలను చూపిస్తుంది. సరైన మార్గం.. తప్పు మధ్య వ్యత్యాసాలను స్పష్టంగా తెలియజేస్తుంది. భావోద్వేగాలు, ఊహించని మలుపులతో సాగే ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. న్యాయం, విముక్తి వంటి అంశాలు జనాలను ఆలోచించేలా చేస్తాయి. అదే మారిశన్ చిత్రం. సుధీష్ శంకర్ దర్శకత్వం వహించిన 2025 తమిళ థ్రిల్లర్ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.
ఇవి కూడా చదవండి : Chandramukhi: వామ్మో.. ఈ అమ్మడు చంద్రముఖి చైల్డ్ ఆర్టిస్టా.. ? ఇప్పుడు క్రేజీ హీరోయిన్ గురూ..
ఇవి కూడా చదవండి : Actress : కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. యాక్టింగ్ మానేసి వ్యవసాయం చేసుకుంటున్న హీరోయిన్.. ఎందుకంటే..
ఇందులో పుష్ప 2 ఫేమ్ ఫహద్ ఫాసిల్ (దయాలన్) దొంగ పాత్రలో నటించాడు. ఇక వడివేలు (వేలాయుధం)అనే అల్జీమర్స్ పేషెంట్ పాత్రలో కనిపించారు. ఇద్దరి మధ్య జరిగే రోడ్డు ప్రయాణం.. ఆ తర్వాత ఇద్దరి జీవితాల్లో ఏం జరిగింది అనేది సినిమా. ఈ సినిమాలో ఫహద్ ఫాసిల్, వడివేలు యాక్టింగ్ హైలెట్ అయ్యాయి. కామెడీ, భావోద్వేగం వంటి అంశాలు కట్టిపడేస్తాయి. జూలై 25, 2025న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా దాదాపు రూ.6.55 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.
ఇవి కూడా చదవండి : Serial Actress : తస్సాదియ్యా.. సీరియల్లో పద్దతిగా.. నెట్టింట అందాల అరాచకంగా.. అమ్మడు ఫాలోయింగ్ చూస్తే..
ప్రారంభ వారాంతంలో భారతదేశంలో దాదాపు రూ. 3.53 కోట్లు వసూలు రాబట్టింది. అలాగే శుక్రవారం రోజుకు రూ.0.75 కోట్లు, శనివారం రూ.1.37 కోట్లు, ఆదివారం రూ.1.39 కోట్లు వసూలు చేసింది. మొత్తం రూ.6.55 కోట్లు రాబట్టిన ఈ సినిమా ఆగస్ట్ 22న ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పుడు ఈ సినిమా టాప్ 10లో ట్రెండింగ్‌లో ఉంది.
ఇవి కూడా చదవండి : Shilpa Shetty: ఏం అందం రా బాబూ.. 50 ఏళ్ల వయసులో పాతికేళ్ల అమ్మాయిలా.. ఫిట్నెస్ సీక్రెట్ చెప్పిన శిల్పా శెట్టి..
ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 90 కోట్లతో తీస్తే 9 కోట్లు లేదు.. బాక్సాఫీస్ వద్ద దారుణమైన డిజాస్టర్..