AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: థియేటర్లలో యూత్ ఎగబడి చూసిన బోల్డ్ సినిమా.. సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది.. పెద్దలకు మాత్రమే

టీనేజర్ల మధ్య కలిగే ఆకర్షణ, లవ్, రొమాన్స్, శృంగారం వంటి సున్నితమైన అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది. చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ థియేటర్లలో బాగానే ఆడింది. ముఖ్యంగా యూత్ ఈ సినిమాను తెగ చూసేశారు. ఇప్పుడీ సినిమా సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది.

OTT Movie: థియేటర్లలో యూత్ ఎగబడి చూసిన బోల్డ్ సినిమా.. సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది.. పెద్దలకు మాత్రమే
OTT Movie
Basha Shek
|

Updated on: Sep 15, 2026 | 6:09 PM

Share

ఈ మధ్యన చిన్న సినిమాలు కూడా ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చి సంచలనం సృష్టిస్తున్నాయి. ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ట్రేడ్ నిపుణులను ఆశ్చర్యపరుస్తూ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఇది చిన్న సినిమానే. కానీ బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కింది. టీనేజర్ల మధ్య కలిగే ఆకర్షణ, లవ్, రొమాన్స్, శృంగారం వంటి సున్నితమైన అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ కారణంగానే థియేటర్లలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా యువత అయితే ఈ మూవీని ఎగబడి చూశారు. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కినప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఇప్పుడీ సినిమా సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే.

ప్రస్తుతం ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న ఈ సినిమా పేరు హుషారు పిట్టలు. టీజర్ విడుదలైనప్పటి నుంచే బోల్డ్ సీన్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో ఈ సినిమా వార్తల్లో నిలిచింది. కొందరైతే ఈ బోల్డ్ సినిమాపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15న థియేటర్లలో రిలీజైంది డబుల్ మీనింగ్ జోకులు, బోల్డ్ సన్నివేశాలున్నా యువతకు సందేశమిచ్చేలా స్టోరీ ఉండడంతో ఈ సినిమా బాగానే ఆడింది. ఇప్పుడీ సినిమా సడెన్ గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే. భిక్షు దర్శకత్వం వహించిన హుషార్ పిట్టలు సినిమాలో అన్ష్ థోరత్, వాసవి గణేషన్ హీరో, హీరోయిన్లుగా నటించారు. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్‌ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్‌ పతాకంపై వెంకట్‌ యాదవ్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు ఏషియన్‌ సురేష్‌ ఫిలింస్‌ సంస్థలు విడుదల చేయడం విశేషం.

ఇవి కూడా చదవండి

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోన్న హుషార్ పిట్టలు సినిమా..

హుషార్ పిట్టలు సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us