AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఇదేం ట్విస్ట్.. రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. 10 కోట్ల డ్రగ్స్ చుట్టూ తిరిగే కథ

శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం (మార్చి 27) పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు కూడా ఇందులో ఉన్నాయి. అయితే ఒక తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా మాత్రం ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఓటీటీలోకి వచ్చింది.

OTT Movie: ఇదేం ట్విస్ట్.. రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. 10 కోట్ల డ్రగ్స్ చుట్టూ తిరిగే కథ
OTT Movie
Basha Shek
|

Updated on: Mar 28, 2026 | 9:55 AM

Share

సాధారణంగా థియేట్రికల్ రిలీజ్ తర్వాత మూడు లేదా నాలుగు వారాలకు ఓటీటీలో సినిమాలు స్ట్రీమింగ్ అవుతుంటాయి. కొన్ని సినిమాలకు ఒక్కోసారి 5, 6 వారాలు లేదా రెండు నెలలు కూడా పట్టొచ్చు. అయితే ఈ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా పట్టుమని రెండు వారాలు పూర్తి కాక ముందే ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే. శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం (మార్చి 27) ఈ సినిమా సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. మార్చి 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆడలేదు. పేరున్న నటీనటులు లేకపోవడం, పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడంతో ఈ సినిమా రిలీజయ్యిందన్న సంగతే చాలా మందికి తెలియదు. అయితే ఈ సినిమా టైటిల్, కథ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. ఒక కాల్ గర్ల్, ఆమెను ప్రేమించే యువకుడు, అంబులెన్స్ డ్రైవర్, ఇద్దరు లవర్స్, డ్రగ్ డీలర్, ఒక ఎస్సై ఇలా డిఫరెంట్ లైఫ్ స్టైల్ గల వ్యక్తులు జీవితం 10 కోట్ల డ్రగ్స్ తో ముడిపడి ఉంటాయి. మరి అసలు ఈ డ్రగ్స్ వ్యవహారంలో వారు ఎందుకు చిక్కుకున్నారు? చివరికి ఏమైంది? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ హెబ్బా పటేల్, చైతన్య రావు జంటగా నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా పేరు “రేపు ఉదయం 10 గంటలకు”. టైటిల్ తోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఈ మూవీ థియేటర్లలో మాత్రం ఆకట్టుకోలేదు. గతంలో ‘ఓ పిట్ట కథ’, ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ సినిమాలకు దర్శకత్వం వహించిన చెందు ముద్దు ఈ సినిమాను తెరకెక్కించాడు. అభినవ్ గోమటం, కిరీటి దామరాజు, సాహితి అవంచ, వాసు ఇంటూరి, మోహిత్ ప్రధాన పాత్రలు పోషించారు. మాస్ మీడియా సమర్పణలో తెరకెక్కిన ‘రేపు ఉదయం 10 గంటలకు’ సినిమాను రామ్ వీరపనేని నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి థియేటర్లలో ఆకట్టుకోని ఈ సినిమా ఓటీటీలో ఏ మాత్రం రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

అమెజాన్ ప్రైమ్ లో హెబ్బా పటేల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వలపు వల.. నేవీ ఉద్యోగులను మాయ చేసిన పాక్ మహిళా ఏజెంట్లు వీరేనట!
వలపు వల.. నేవీ ఉద్యోగులను మాయ చేసిన పాక్ మహిళా ఏజెంట్లు వీరేనట!
ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్.. ముహూర్తం ఖారారు.. అప్పటినుంచే..
ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్.. ముహూర్తం ఖారారు.. అప్పటినుంచే..
32 ఫోర్లు, 17 సిక్సర్లు.. ఎకానా గడ్డ.. సర్పంచ్ సాబ్ అడ్డా
32 ఫోర్లు, 17 సిక్సర్లు.. ఎకానా గడ్డ.. సర్పంచ్ సాబ్ అడ్డా
రోజూ నీరసంగా ఉంటున్నారా? ఈ సహజ ఆహారాలు మీ డైట్‌లో చేర్చుకోండి
రోజూ నీరసంగా ఉంటున్నారా? ఈ సహజ ఆహారాలు మీ డైట్‌లో చేర్చుకోండి
'జీవిత భాగస్వామిగా భావించా.. నీకు ఎయిడ్స్ ఉందా? అన్నాడు'
'జీవిత భాగస్వామిగా భావించా.. నీకు ఎయిడ్స్ ఉందా? అన్నాడు'
అరసవల్లి సూర్యనారాయణ స్వామికి అపురూప ఆభరణాల సమర్పణ.. విలువెంతంటే
అరసవల్లి సూర్యనారాయణ స్వామికి అపురూప ఆభరణాల సమర్పణ.. విలువెంతంటే
దసరా, దీపావళికి ఇంటికెళ్తున్నారా..? ఈ రైళ్లల్లో సీట్లు ఖాళీ
దసరా, దీపావళికి ఇంటికెళ్తున్నారా..? ఈ రైళ్లల్లో సీట్లు ఖాళీ
టీ20I డెబ్యూలోనే దుమ్ములేపిన నమన్ ధీర్
టీ20I డెబ్యూలోనే దుమ్ములేపిన నమన్ ధీర్
5 ఏళ్ల ప్రజాసేవ.. 75 గంటల ‘మోదీ జాతర’.. తిరుపతిలో భారీ కార్యక్రమం
5 ఏళ్ల ప్రజాసేవ.. 75 గంటల ‘మోదీ జాతర’.. తిరుపతిలో భారీ కార్యక్రమం
గుడ్లు ఉడికించేటప్పుడు దీన్ని వేస్తే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది..
గుడ్లు ఉడికించేటప్పుడు దీన్ని వేస్తే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది..