AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీలోకి వచ్చిన 24 గంటల్లోనే టాప్‌లో ట్రెండింగ్.. ఈ న్యూ ఏజ్ లవ్ స్టోరీని అసలు మిస్ అవ్వద్దు

ఈ వీకెండ్ లో ఇంటిల్లిపాది నవ్వుకునేలా మంచి సినిమా చూడాలనుకుంటున్నారా? అయితే మీకు ఈ తెలుగు సినిమా బెస్ట్ ఛాయిస్. జెన్ జీ రోమ్‌ కామ్ కంటెంట్‌తో ఓటీటీలోకి వచ్చిన ఈ తెలుగు సినిమా ఇప్పుడు ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటోంది.

OTT Movie: ఓటీటీలోకి వచ్చిన 24 గంటల్లోనే టాప్‌లో ట్రెండింగ్.. ఈ న్యూ ఏజ్ లవ్ స్టోరీని అసలు మిస్ అవ్వద్దు
OTT Movie
Basha Shek
|

Updated on: Aug 23, 2026 | 12:25 PM

Share

గత వారం ఓటీటీల్లోకి పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. దళపతి విజయ్ జన నాయగన్, కిరణ్ అబ్బవరం చెన్నై లవ్ స్టోరీ, ఘట్టమనేని జయకృష్ణ శ్రీనివాస మంగాపురం, శ్రీకాంత్ ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ వంటి తెలుగు సినిమాలతో పాటు వివిధ భాషలకు చెందిన చిత్రాలు, సిరీస్ లు ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్ కు వినోదం పంచుతున్నాయి. అయితే వీటిలో ఒక తెలుగు సినిమా ఇప్పుడు టాప్ లో ట్రెండ్ అవుతోంది. నేటి జెన్-Z యూత్ కు తగ్గట్టుగా ఈ సినిమాలో యువతకు నచ్చే అంశాలు చాలా ఉన్నాయి. అలాగే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కావడంతో ఈ సినిమా ఓటీటీ ఆడియెన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. దుబాయ్‌లో సివిల్ ఇంజనీర్‌గా ఉద్యోగం వదిలేసి, ఎలాగైనా ఒక మంచి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే లక్ష్యంతో ఇండియాకు తిరిగి వస్తాడు హీరో. ఈ క్రమంలోనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన పవిత్ర అలియాస్ ‘పర్పుల్ పవి’ని ప్రేమలో పడతాడు. ఆ తర్వాత పరస్పర అంగీకారంతో పెళ్లి చేసుకుంటారు. అయితే పెళ్లయ్యాక పవిత్ర తీసుకున్న ఓ నిర్ణయం వల్ల వీరి కాపురంలో పెద్ద గందరగోళం ఏర్పడుతుంది. మరి అదేంటి? అల్లుడు అత్తారింటి బాధ్యతలు, ఇంటి పనులను చూసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? చివరకు ఏమైంది? అన్నది తెలుసుకోవాలంటే ఈ జెన్-Z మూవీ చూడాల్సిందే.

ప్రస్తుతం ఓటీటీ ట్రెండింగ్ టాప్ లో దూసుకెళుతోన్న ఈ సినిమా పేరు ‘ప్యార్ ప్రేమ కళ్యాణం’. తెలుగమ్మాయి శాన్వీ మేఘన ఇందులో హీరోయిన్ గా నటించడం విశేషం. డైరెక్టర్ ఎలాన్ హీరోగా నటిస్తూ స్వయంగా ఈ సినిమాను తెరకెక్కించాడు. హీరో, హీరోయిన్లతో పాటు రాధికా శరత్‌కుమార్, యోగి బాబు, ఎం.ఎస్. భాస్కర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. యువన్ శంకర్ రాజా చిత్రానికి సంగీతం అందించారు. కేవలం రెండు గంటల రన్‌టైమ్‌తో ఎక్కడా బోర్ కొట్టకుండా సాగిపోయే ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ లో టాప్ ప్లేస్ లో ట్రెండింగ్ అవుతోంది. ఈ వీకెండ్ లో మంచి ఫన్ ఫుల్ ఎంటర్ టైనర్ మూవీని చూడాలనుకునేవారికి ‘ప్యార్ ప్రేమ కళ్యాణం’ ఒక బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ లో ప్యార్ ప్రేమ కల్యాణం..

ప్యార్ ప్రేమ కల్యాణం సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us