బుల్లితెర ప్రేక్షకులకు గుడ్ న్యూస్. బిగ్ బాస్ మళ్లీ వచ్చేస్తున్నాడు. ఇటీవలే సక్సెస్ ఫుల్‌గా ఏడు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ సెలబ్రిటీ గేమ్ షో మరోసారి నాన్ స్టాప్ వినోదాన్ని అందించేందుకు ముస్తాబవుతోంది. అదే నండి బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ సెకెండ్ సీజన్. గతేడాది ఫిబ్రవరిలో ‘బిగ్‌బాస్ నాన్- స్టాప్’ పేరుతో డిస్నీ హాట్‌స్టార్‌లో మాత్రమే షో ప్రసారం అయింది. అది కూడా 24/7. బిందు మాధవి విజేతగా నిలిచింది. మరి బుల్లితెర బిగ్ బాస్‌లా పెద్దగా సక్సెస్ కానప్పటికీ ఉన్నంతలో కాస్త మంచిగానే బజ్ క్రియేట్ అయింది ఓటీటీ షోకి. ఈనేపథ్యంలో బిగ్ బాస్ ఓటీటీ సెకెండ్ సీజన్ కోసం నిర్వాహకులు గట్టిగానే ప్లాన్ చేస్తున్నారట. దీనిపై ఇటీవల ముగిసిన ఏడో సీజన్లో హింట్ ఇచ్చారు హోస్ట్ నాగార్జున. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఫిబ్రవరిలోనే బిగ్ బాస్ ఓటీటీ రెండో సీజన్ ప్రారంభమవుతుందని టాక్ వినిపిస్తోంది.
గతేడాది ఓటీటీ షోలో కొత్త కంటెస్టెంట్స్ తో పాటు పాత కంటెస్టెంట్స్ కూడా హౌజ్‌లోకి వచ్చారు . అలా ఈసారి బిగ్ బాస్ సీజన్-7లో బాగా ఫేమస్ అయిన కొంతమందిని ఓటీటీ షో కోసం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందులో పాట బిడ్డ భోలే షావలి, నయని పావణిల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
ఇక కొత్త కంటెస్టెంట్ల విషయానికొస్తే కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క కూడా హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సోషల్ మీడియా ఫాలోయింగ్‌తో ఏకంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిందామె. దీంతో రెండు రాష్ట్రాల్లో బర్రెలక్క పేరు బాగా మార్మోగిపోయింది. దీంతో ఎలాగైనా ఆమెను హౌజ్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారట బిగ్ బాస్ నిర్వాహకులు. వీరితో పాటు సరిగమప షోతో సింగర్‌గా పాపులరైన పార్వతిని కూడా సంప్రదించారట. అలాగే నవాబ్ కిచెన్ తో నెట్టింట బాగా ట్రెండ్ అవుతోన్న మోయిన్ భాయ్‌ను కూడా బిగ్ బాస్ హౌజ్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట. అలాగే సోషల్ మీడియాలో బాగా గుర్తింపు తెచ్చుకున్న వారిని బిగ్ బాస్ నిర్వాహకులు కలుస్తున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.