సుధీర్ బాబు… ఆనంది హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా శ్రీదేవి సోడా సెంటర్.. పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్ట్ 27న థియేటర్లలో విడుదలై మంచి విజయం అందుకుంది. కరోనా సెకండ్ వేవ్ అనంతరం థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్గా నిలవడమే కాకుండా.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. విలేజ్ బ్యాక్ గ్రౌండ్ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో సుధీర్.. సూరిబాబు పాత్రలో…సోడాలు శ్రీదేవి పాత్రలో ఆనంది నటించారు…. కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత విడుదలై మంచి టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా..ఇప్పుడు ఓటీటీ వేదిక ద్వారా మరోసారి ప్రేక్షకులను అలరించనుంది.
దీపావళి కానుకగా ఈ మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 తెలుగులో నవంబర్ 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఈ సినిమాను 70mm ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజయ్ చిల్లా – శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మించారు.. ఇందులో నరేశ్, షావుల్ నవగీతమ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలో పరువు కోసం ఓ కన్నతండ్రి ఎంత దారుణానికి ఒడిగట్టారు? తన కులం కాని అమ్మాయిని ప్రేమించిన హీరో ఎన్ని కష్టాలు పడ్డాడు? అనేది సినిమాలో చాలా హృద్యంగా చూపించారు.
ట్వీట్..
Meet our #LightingSooriBabu & #SodaalaSridevi this Diwali exclusively on @ZEE5Telugu
▶️ https://t.co/2Oc6mELL9n#SrideviSodaCentre an action-packed family drama entertainer #Premieres4thNovember @70mmEntertains @isudheerbabu @anandhiactress @vijaychilla @karunafilmmaker #ZEE5
— 70MM Entertainments (@70mmEntertains) October 25, 2021
Also Read: Ram Charan : అంచనాలు పెంచేస్తున్న చరణ్- శంకర్ సినిమా.. ఒక్క పాట కోసం భారీ ప్లాన్ చేసిన మేకర్స్..
వర్మ రింగ్ మాస్టర్.. ఆసక్తికర కామెంట్స్ చేసిన మంచు మనోజ్.. హిలేరియస్ ఆన్సర్ ఇచ్చిన ఆర్జీవి..
Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌లో ప్రియ ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా.? ఏడు వారాలకు ఏకంగా..