బాలయ్య బర్త్‌డే.. నెక్ట్స్ మూవీపై క్లారిటీ

నటసింహం నందమూరి బాలకృష్ణ ఇవాళ 59వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటించే తదుపరి చిత్రంపై క్లారిటీ వచ్చింది. తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య 105వ చిత్రంలో నటించనున్నాడు. ఈ చిత్రాన్ని సి. కల్యాణ్ నిర్మించనున్నాడు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్ బాలయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలిపింది. ప్రస్తుతం ఈ మూవీకి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా బాలయ్య, రవి […]

బాలయ్య బర్త్‌డే.. నెక్ట్స్ మూవీపై క్లారిటీ
Follow us

| Edited By:

Updated on: Jun 10, 2019 | 10:52 AM

నటసింహం నందమూరి బాలకృష్ణ ఇవాళ 59వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటించే తదుపరి చిత్రంపై క్లారిటీ వచ్చింది. తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య 105వ చిత్రంలో నటించనున్నాడు. ఈ చిత్రాన్ని సి. కల్యాణ్ నిర్మించనున్నాడు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్ బాలయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలిపింది. ప్రస్తుతం ఈ మూవీకి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా బాలయ్య, రవి కుమార్ కాంబినేషన్‌లో ఇది వరకు వచ్చిన ‘జై సింహా’ యావరేజ్ టాక్‌ను తెచ్చుకున్నప్పటికీ.. కలెక్షన్లలో బాక్సాఫీస్ వద్ద మంచి హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.