Ante Sundaraniki: డిజిటల్‌ ప్రీమియర్‌కు సిద్ధమవుతోన్న సుందరం.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

|

Jun 23, 2022 | 6:40 PM

Ante Sundaraniki OTT: న్యాచురల్ స్టార్ నాని (Nani), మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్‌ (Nazriya Nazim) జంటగా నటించిన చిత్రం అంటే సుందరానికీ (Ante Sundaraniki). మెంటల్‌ మదిలో, బ్రోచేవారెవరురా వంటి హిట్‌ సినిమాలు తెరకెక్కించిన వివేక్ ఆత్రేయ (Vivek Atreya) ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు..

Ante Sundaraniki: డిజిటల్‌ ప్రీమియర్‌కు సిద్ధమవుతోన్న సుందరం.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?
Nani
Follow us on

Ante Sundaraniki OTT: న్యాచురల్ స్టార్ నాని (Nani), మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్‌ (Nazriya Nazim) జంటగా నటించిన చిత్రం అంటే సుందరానికీ (Ante Sundaraniki). మెంటల్‌ మదిలో, బ్రోచేవారెవరురా వంటి హిట్‌ సినిమాలు తెరకెక్కించిన వివేక్ ఆత్రేయ (Vivek Atreya) ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. విడుదలకు ముందే టీజర్లు, ట్రైలర్లతో ఆసక్తిని రేకెత్తించిన ఈ చిత్రం జూన్‌ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌ తెలుగు, తమిళ్ , మలయాళ భాషల్లోనూ విడుదలైంది. కాగా ఈ సినిమాలో నాని సుందరం పాత్రలో.. నజ్రియా క్రిస్టియన్ అమ్మాయి లీలా థామస్ పాత్రలో కనిపించారు. మతాంతర వివాహం కాన్సెప్ట్‌ని కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్‏గా రూపొందించడంలో చాలా వరకు సక్సెస్‌ సాధించాడు డైరెక్టర్‌ వివేక్‌. ఇదిలా ఉంటే థియేటర్లలో మిక్స్‌డ్‌టాక్‌ తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోనూ సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్‌ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా ఓటీటీ రిలీజ్ అగ్రిమెంట్ ప్రకారం థియేటర్లలో విడుదలైన సరిగ్గా 28 రోజులకే డిజిటల్ లోకి అంటే సుందరానికి సినిమా వచ్చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం జూలై 8 నుంచి అంటే సుందరానికి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. తెలుగుతోపాటు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఈ మూవీని రిలీజ్ చేయనున్నారట. త్వరలోనే ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారట మేకర్స్.ఇక ఈ చిత్రంలో నరేశ్‌, రోహిణి, నదియా, హర్షవర్ధన్‌, రాహుల్‌ రామకృష్ణ, సుహాస్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..