Miss World Krystyna Pyszkova: ఈ మిస్ వరల్డ్ మనసూ అందమైనదే.. పేద పిల్లల చదువు క్రిస్టినా ఏం చేస్తోందో తెలుసా?

|

Mar 10, 2024 | 9:31 AM

చెక్ రిపబ్లిక్‌ కు చెందిన క్రిస్టినా 1999 జనవరి 19న జన్మించింది. దేశ రాజధాని ప్రేగ్‌లోని చార్లెస్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పట్టా అందుకుంది. ఇదే కాకుండా మేనేజ్‌మెంట్ కోర్సు కూడా చేస్తోంది. అకడమిక్స్ తో పాటు కల్చరల్ యాక్టివిటీస్ లోనూ సత్తా చాటుతోందీ అందాల తార. అన్నట్లు క్రిస్టినా లాగే ఆమె మనసూ కూడా అందమైనదే. పేదలు, చిన్నారుల కోసం ఆమె పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

Miss World Krystyna Pyszkova: ఈ మిస్ వరల్డ్ మనసూ అందమైనదే.. పేద పిల్లల చదువు క్రిస్టినా ఏం చేస్తోందో తెలుసా?
Miss World 2024 Krystyna Pyszkova
Follow us on

ప్రతిష్ఠాత్మక మిస్ వరల్డ్ 2024 ఫైనల్ పోటీలు అట్టహాసంగా జరిగాయి. ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ముగిసిన ఈ ఈవెంట్ కు పలువురు బాలీవుడ్ తారలు కూడా హాజరయ్యారు. ఈసారి ప్రపంచ సుందరి కిరీటం కోసం 115 దేశాల అందగత్తెలు పోటీ పడ్డారు. అయితే వీరందరిని కాదని చెక్ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా పిజ్కోవా మిస్ వరల్డ్ 2024 కిరీటం సొంతం చేసుకుంది. ఈ పోటీలో లెబనాన్‌కు చెందిన యాస్మినా జైటౌన్ ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. గతేడాది విజేత కరోలినా బిలావ్స్కా , రన్నరప్‌ లు క్రిస్టినా తలపై మిస్ వరల్డ్ కిరీటాన్ని అలంకరించారు. మరి 25 ఏళ్లకే మిస్ వరల్డ్ కిరీటం గెల్చుకున్న క్రిస్టినా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి. చెక్ రిపబ్లిక్‌ కు చెందిన క్రిస్టినా 1999 జనవరి 19న జన్మించింది. దేశ రాజధాని ప్రేగ్‌లోని చార్లెస్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పట్టా అందుకుంది. ఇదే కాకుండా మేనేజ్‌మెంట్ కోర్సు కూడా చేస్తోంది. అకడమిక్స్ తో పాటు కల్చరల్ యాక్టివిటీస్ లోనూ సత్తా చాటుతోందీ అందాల తార. అన్నట్లు క్రిస్టినా లాగే ఆమె మనసూ కూడా అందమైనదే. పేదలు, చిన్నారుల కోసం ఆమె పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందుకోసం క్రిస్టినా పిజ్ కోవా పేరుతో ఏకంగా ఫౌండేషన్ ను కూడా స్థాపించింది.

తన ఫౌండేషన్ ఆధ్వర్యంలోనే పేద పిల్లల చదువు కోసం పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అలాగే మానసిక రోగులకు కూడా తనవంతు సహాయం చేస్తోంది. ఇదిలా ఉంటే సుమారు 28 ఏళ్ల తర్వాత మిస్‌ వరల్డ్‌ పోటీలకు భారత్‌ ఆతిథ్యమిచ్చింది. ఇక ఈ అందాల పోటీల్లో భారత్ కు చెందిన సినీ శెట్టి ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. ముంబైలో పెరిగి అక్కడే చదువుకున్న సినీ శెట్టి 115 దేశాల అందాల తారలతో పోటీ పడి టాప్-8 వరకు వెళ్లింది. అయితే ఆ తర్వాత టాప్‌ 4 స్టేజ్‌కు ఆమె క్వాలిఫై కాలేకపోయింది. ఫలితంగా ఒక్క అడుగు దూరంలో సినీ శెట్టి కీరిటాన్ని చేజార్చుకుంది.

ఇవి కూడా చదవండి

పేద పిల్లల కోసం..

 

మిస్ వరల్డ్ క్రిస్టినా ఫొటోలు..

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..