
మెగాస్టార్ చిరంజీవి ఏ సినిమా ఈవెంట్‌కు వెళ్లినా అక్కడ తనదైన శైలిలో మాట్లాడి అలరిస్తుంటారు. ముఖ్యంగా ఆయన తదుపరి చిత్రాలకు సంబంధించి ఏదో ఒక ఆసక్తికరమైన హింట్ వదలడం, దాంతో ‘చిరు లీక్స్’ సోషల్ మీడియాలో ట్రెండ్ కావడం ఎప్పట్నుంచో జరుగుతోంది. తాజాగా మరోసారి తన సరదా మాటలతో మెగాస్టార్ తన తర్వాతి సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని లీక్ చేసి నెట్టింట పెద్ద చర్చకు తెరలేపారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి.. సక్సెస్ఫుల్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో ‘కాకా’ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మలయాళ టాలెంటెడ్ నటి అనస్వర రాజన్ ఒక కీలక పాత్రలో నటిస్తోంది. అయితే ఇటీవల జరిగిన ‘ఇట్లు అర్జున’ సక్సెస్ మీట్ వేదికపై ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరంజీవి.. అనస్వర నటనను కొనియాడుతూనే ‘కాకా’ సినిమాలోని ఆమె పాత్ర గురించి ఒక హింట్ వదిలారు.
ఎక్కువ మంది చదివినవి : Gulabi Movie: ఒక్క పాటతో స్టార్ డమ్.. గులాబీ సినిమాను మిస్సైన హీరోయిన్.. ఎవరంటే..
“అనస్వర.. నువ్వేమైనా మాట్లాడతావా? తను మాట్లాడదు.. మాట్లాడలేదు. నేను చెప్పిన ఈ చిన్న మాటను మీరు ఇంటికి వెళ్లాక ఆలోచించండి, అప్పుడు అసలు విషయం ఏంటో మీకే అర్థమవుతుంది” అంటూ చిరు నవ్వుతూ చెప్పడం సభలో నవ్వులు పూయించింది. చిరు అలా అనగానే.. అరే సార్ సీక్రెట్ లీక్ చేసేశారే అన్నట్లుగా అనస్వర ఇచ్చిన క్యూట్ ఎక్స్ప్రెషన్ హైలైట్‌గా నిలిచింది. దీంతో చిరంజీవి మాటలను బట్టి చూస్తే, ‘కాకా’ చిత్రంలో అనస్వర రాజన్ మాటలు రాని మూగమ్మాయి పాత్రలో నటిస్తోందని నెటిజన్లు ఫిక్స్ అయిపోయారు. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ , బలమైన ఎమోషన్స్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Megastar Chiranjeevi: చిరంజీవికి భార్యగా, చెల్లిగా నటించిన ఏకైక హీరోయిన్.. 20 ఏళ్లుగా తగ్గని స్టార్ డమ్..
ఇక తర్వాత యాంకర్ స్రవంతిని ఉద్దేశిస్తూ.. నువ్వు నన్ను ఏ ప్రశ్నలు అడగొద్దు తల్లీ.. నేనేం లీక్ చేస్తానోనని నాకే టెన్షన్ గా ఉంది. కాస్త దూరంగా ఉండు అంటూ చిరు సరదాగా నవ్వించారు. ఇక ఇల్లు అర్జున వేదికపై చిరు చేసిన స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.
ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: ఏం ట్విస్టులు రా బాబూ.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రెండింగ్‌లో నంబర్ వన్..
ఎక్కువ మంది చదివినవి : ఏముంటది భయ్యా ఈ సాంగ్.. చిరంజీవి, విజయశాంతి కాంబో.. థియేటర్లను ఓ ఊపు ఊపేసింది..