మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్‌ను ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. సోమవారం చెర్రీ తన పేరు మీద ఇన్‌స్టా ఓపెన్ చేయగా.. ప్రస్తుతం ఆయనను 2లక్షల 9వేల మంది ఫాలో అవుతున్నారు. అయితే కేవలం అకౌంట్‌ను ఓపెన్ చేసిన ఈ హీరో.. ఆ తరువాత అందులో ఇంతవరకు ఎలాంటి పోస్ట్ చేయలేదు. అయితే ఈ శుక్రవారం తాను ఇన్‌స్టాలోకి డెబ్యూట్ ఇస్తానని చెప్పిన చెర్రీ.. తాజాగా ఫ్యాన్స్‌కు ఓ మెసేజ్ ఇచ్చాడు.
‘‘ఈ శుక్రవారం ఇన్‌స్టాలోకి రాబోతున్నా. అక్కడ మీతో కనెక్ట్ అయ్యేందుకు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఇది నాకు కొత్త. ఫైనల్‌గా నేను ఇన్‌స్టాను పొందాను’’ అంటూ ఆయన ఓ వీడియో మెసేజ్‌ను విడుదల చేశాడు.
Mega Powerstar Ram Charan debuts on Instagram. Here’s a special message from him to his fans.#RamCharanOnInstagram #RamCharan pic.twitter.com/fwxt8t3FpY
— Venkatesh V (@venkatesh_et) July 10, 2019
అయితే సోషల్ మీడియాకు చెర్రీ కాస్త దూరంగా ఉంటాడు. ఇప్పటివరకు ఫేస్‌బుక్‌లో మాత్రమే ఆయనకు అకౌంట్ ఉంది. అప్పట్లో ట్విట్టర్‌లో ఖాతా ఉన్నప్పటికీ.. కొన్ని కారణాల వలన ఆ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేశాడు రామ్ చరణ్. ఇక ఇప్పుడు ఫ్యాన్స్‌తో మరింత దగ్గరగా ఉండేందుకు ఆయన ఇన్‌స్టాను ఓపెన్ చేశారు. కాగా ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్‌లో నటిస్తోన్న చెర్రీ.. మరోవైపు తన తండ్రి చిరంజీవి హీరోగా నటించిన ప్రతిష్టాత్మక చిత్రం సైరాను నిర్మించిన విషయం తెలిసిందే.