హీరోయిన్ క్రూరత్వం.. స్నేహితుడిని చంపేసి శవం ముందే లవర్‏తో శృంగారం.. ఆ తర్వాత బాడీని ముక్కలుగా చేసి..

|

Aug 22, 2024 | 1:49 PM

నీరజ్ గ్రోవర్ హత్య కేసులో కన్నడ హీరోయిన్ మరియా సుసైరాజ్, ఆమె ప్రియుడు లెఫ్టినెంట్ ఎమిల్ జెరోమ్ మాథ్యూను పోలీసులు అరెస్ట్ చేశారు. నీరజ్ గ్రోవర్.. హీరోయిన్ మరియాకు స్నేహితుడు. ఆమె రూం మారేందుకు షిఫ్టింగ్ లో సహాయం చేయడానికి వెళ్లి ఆ తర్వాత కనిపించలేదు. రోజులు, నెలలు గడుస్తున్నప్పటికీ అతడి ఆచూకి తెలియరాలేదు

హీరోయిన్ క్రూరత్వం.. స్నేహితుడిని చంపేసి శవం ముందే లవర్‏తో శృంగారం.. ఆ తర్వాత బాడీని ముక్కలుగా చేసి..
Maria Susairaj
Follow us on

సినీ పరిశ్రమ ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ నటీనటులుగా గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో ఆశలతో వస్తుంటారు. కానీ అనుకోకుండా ఊహించని నేరాలు, ఘోరాలు చేస్తుంటారు. కొన్నిసార్లు పలు నేరాలలో చిక్కుకోవాల్సి వస్తుంది. హీరోయిన్ కావాలనే కోరికతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. మొదటి సినిమాతోనే స్టార్ అయ్యింది ఓ అమ్మాయి. కానీ ఆ తర్వాత స్నేహితుడిని చంపి అతడి శవాన్ని ముక్కలు చేసింది. 2008లో దేశాన్ని కుదిపేసిన దారుణమైన ఘటన. 26 ఏళ్ల టెలివిజన్ ఎగ్జిక్యూటివ్ నీరజ్ గ్రోవర్ హత్య ఉదంతం ఇది. అప్పట్లో ముంబై నగరాన్ని కుదిపేసిన ఈ ఘటన ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. నీరజ్ గ్రోవర్ హత్య కేసులో కన్నడ హీరోయిన్ మరియా సుసైరాజ్, ఆమె ప్రియుడు లెఫ్టినెంట్ ఎమిల్ జెరోమ్ మాథ్యూను పోలీసులు అరెస్ట్ చేశారు. నీరజ్ గ్రోవర్.. హీరోయిన్ మరియాకు స్నేహితుడు. ఆమె రూం మారేందుకు షిఫ్టింగ్ లో సహాయం చేయడానికి వెళ్లి ఆ తర్వాత కనిపించలేదు. రోజులు, నెలలు గడుస్తున్నప్పటికీ అతడి ఆచూకి తెలియరాలేదు. దీంతో నీరజ్ స్నేహితుడు పోలీసులను ఆశ్రయించగా చివరకు మొబైల్ నెట్ వర్క్ ద్వారా నీరజ్ లొకేషన్ గుర్తించారు. ఆ ఒక్క కాల్ దారుణ హత్య కేసును బట్టబయలు చేసింది. ఈ కేసులో ముందుగా హీరోయిన్ మరియాను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆమె చెప్పిన విషయాలు విని పోలీసులు షాకయ్యారు. నీరజ్ ను హత్య చేసిన తర్వాత మరియా తన ప్రియుడు మథ్యూతో కలిసి శవం ముందే శృంగారంలో పాల్గొన్నారని.. ఆ తర్వాత నీరజ్ బాడీని 300 ముక్కలుగా నరికి పారేశారని తెలిసి పోలీసులు నిర్ఘాంతపోయారు.

మైసూర్‌లోని క్రిస్టియన్ కుటుంబంలో జన్మించిన మరియా మోనికా సుసైరాజ్ హీరోయిన్ కావాలనే కోరిక. కానీ అందుకు కుటుంబం ఒప్పుకోకపోవడంతో ఇళ్లు వదిలి బెంగుళూరులో సెటిల్ అయ్యింది. మొదట్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన మరియ.. 2002లో జూట్ చిత్రంలో నటించింది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతోపాటు మరియా నటనపై ప్రశంసలు వచ్చాయి. కేవలం కన్నడ కాదు హిందీ సినిమాల్లో నటించాలని మరియ కోరిక. దీంతో తరచూ ఆడిషన్స్ కోసం ముంబై వెళ్లడంతో అక్కడ ఇండస్ట్రీలో మంచి సంబంధాలు ఉన్న నీరజ్ గ్రోవర్ తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది. 2008లో నీరజ్ ఏక్తాకపూర్ నిర్మాణ సంస్థ బాలాజీ టెలిఫిల్స్మ్ తో పనిచేస్తున్నాడు.

ప్రతిసారి ముంబై వచ్చే మరియా.. ఈసారి అక్కడే సెటిల్ అయ్యింది. నీరజ్ తో కలిసి లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉంది. కానీ అప్పటికే మైసూర్ కు చెందిన జెరోమ్ మాథ్యూతో ప్రేమలో ఉంది మరియ. వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. జెరోమ్ ఇండియన్ ఆర్మీలో ఉండేవాడు. అటు నీరజ్ తనకు స్నేహితుడని.. అతడు తనను లవ్ చేస్తున్నాడని మాథ్యూతో చెప్పింది మరియా.. నీరజ్ వద్ద మాథ్యు విషయాన్ని దాచిపెట్టింది.ఆ తర్వాత కొన్నాళ్లకు మరియ వేరే ఫ్లాట్ కు షిఫ్ట్ అయ్యింది. ఆసమయంలో తనకు సాయం చేయడానికి వచ్చిన నీరజ్ ఆ తర్వాత కనిపించలేదు. మే 8వ తేదీన నీరజ్ స్నేహితుడు లాల్ మరియాపై అనుమానంతో పోలీసులను ఆశ్రయించగా వారు మరియను అరెస్ట్ చేయగా ఆమె కాల్ రికార్డ్స్ చెక్ చేసిన పోలీసులు షాకయ్యారు. మే 8 నుండి మే 20 వరకు, మారియా, ఆమె ప్రియుడు జెరోమ్ మాథ్యూ మధ్య 1,000 కాల్స్ వచ్చాయి. నీరజ్, మరియా ఒకే గదిలో ఉండడం చూసిన మాథ్యూ అతడిపై దాడి చేసి చంపేశాడు.

ఇవి కూడా చదవండి

నీరజ్ మరణించిన తర్వాత గది శుభ్రం చేసిన మరియా…రక్తంతో నిండిన అతడి శవన్ని శుభ్రం చేసింది. ఆ తర్వాత నీరజ్ శవం ముందే ఆమె తన ప్రియుడు మాథ్యుతో శృంగారంలో పాల్గొంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి సమీపంలోని షాపింగ్ మాల్‌కు వెళ్లారు, అక్కడ వారు పాలీబ్యాగ్‌లు, పదునైన కత్తులు కొనుగోలు చేశారు. తర్వాత నీరజ్ మృతదేహాన్ని 300 ముక్కలుగా నరికి దారిలో పెట్రోల్ కొని నిర్జన ప్రదేశంలో నీరజ్ బాడీకి నిప్పంటించారు. ఇద్దరూ శరీర భాగాలను పారవేసేందుకు బయటకు వెళ్లగా, నీరజ్ ఫోన్ మరియా జీన్స్ జేబులో ఉంది. దారిలో నీరజ్ ఫోన్ మోగింది, మరియా నంబర్ చూడాలని జేబులోంచి ఫోన్ తీసింది. ఆ సమయంలో పొరపాటున కాల్ వచ్చింది. ఆ ఒక్క కాల్ ఈ హత్య కేసులో ముఖ్యమైన లింక్ అని రుజువైంది. మరియా మోనికా సుసైరాజ్ హత్యకు పాల్పడలేదు, కానీ సాక్ష్యాలను నాశనం చేసినందుకు దోషిగా తేలింది. ఆమెకు మూడేళ్లు జైలు శిక్ష విధించింది కోర్టు. హత్య జెరోమ్ మాథ్యూకు పదేళ్లు, సాక్ష్యాలను మాయం చేసినందుకు మూడేళ్లు జైలు శిక్ష విధించింది కోర్టు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.