Jagapathi Babu: ఆ హీరోను ప్రతిరోజూ తలుచుకుంటా.. బతికితే అతడిలా బతకాలి.. జగపతి బాబు..

విలక్షణ నటుడు జగపతి బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు పాపులర్ హీరో. ముఖ్యంగా ఫ్యామిలీ ప్రేక్షకులకు ఇష్టమైన హీరో. ఇప్పుడు విలన్ గా, సహయ నటుడిగా కొనసాగుతున్నారు. కంటెంట్ ప్రాధాన్యత, వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ హీరో గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.

Jagapathi Babu: ఆ హీరోను ప్రతిరోజూ తలుచుకుంటా.. బతికితే అతడిలా బతకాలి.. జగపతి బాబు..
Jagapathi Babu

Updated on: Feb 28, 2026 | 6:44 PM

విలక్షణ నటుడు జగపతి బాబు తన వ్యక్తిగత, వృత్తి జీవితంలోని పలు కీలక అంశాలపై ఓ ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడారు. తన కెరీర్‌లో ఎదురైన ఆర్థిక కష్టాలను, కుటుంబ బంధాలను, అలాగే తోటి నటులపై తన అభిప్రాయాలను వెల్లడించారు. తన కెరీర్ డౌన్‌ఫాల్ ప్రారంభమైన ఆరు నెలల తర్వాత తాను ఇల్లు కట్టే నిర్ణయం తీసుకున్నానని, ఇది తాను చేసిన పెద్ద తప్పులలో ఒకటిగా చెప్పుకొచ్చారు. ఆ సమయంలో రెమ్యూనరేషన్లు తగ్గి, సినిమాలు ఫ్లాప్‌లు కావడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డానని గుర్తు చేసుకున్నారు. కుటుంబ సభ్యులకు తన కష్టాలు తెలియకూడదనే ఉద్దేశంతో, భావోద్వేగంతో అప్పులు చేసి ఇల్లు నిర్మించానని. ఈ నిర్ణయం వల్ల 15-20 ఏళ్ల పాటు భారీ వడ్డీలు చెల్లించాల్సి వచ్చిందని, ఇది తన ప్రధాన నష్టమని పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యులు తన పరిస్థితిని అర్థం చేసుకున్నారని, ఈ విషయంలో వారు చాలా అండగా నిలిచారని జగపతి బాబు తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Folk Song: ఏం పాట భయ్యా.. కుర్రాళ్లకు పిచ్చేక్కించేసింది.. యూట్యూబ్‏ను ఊపేసిన ఫోక్ సాంగ్..

సైరా నరసింహారెడ్డి సినిమా షూటింగ్ అనుభవాలను పంచుకుంటూ, రామ్ చరణ్ ప్రొడక్షన్ పద్ధతిని ఆయన ప్రశంసించారు. జార్జియాలో జరిగిన షూటింగ్‌లో యూనిట్ సభ్యులందరినీ, ముఖ్యంగా చిన్నవారిని, చిరంజీవి, రామ్ చరణ్ ఎంత బాగా చూసుకున్నారో వివరించారు. భోజనం, వసతి, పాకెట్ మనీ, ఆరోగ్య సంరక్షణ వంటి అన్ని విషయాల్లోనూ రామ్ చరణ్ చూపిన శ్రద్ధ అభినందనీయమని కొనియాడారు. బడ్జెట్ కంటే ట్రీట్‌మెంట్ ముఖ్యమని రామ్ చరణ్ నిరూపించారని ఆయన తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Actress : రాజమౌళి మాటలతో నా గుండె పగిలిపోయింది.. ఆ సినిమా వదులుకోకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ హీరోయిన్..

తన బాల్య స్నేహితుల గురించి ప్రస్తావిస్తూ, వెంకటేశ్, నాగార్జున, చిరంజీవి కుటుంబాలతో తమ కుటుంబానికి దశాబ్దాల అనుబంధం ఉందని చెప్పారు. నాగార్జున తనకంటే రెండు, మూడేళ్లు పెద్దవాడని, తన సోదరుడిలాంటి స్నేహితుడని తెలిపారు. నాగార్జున జీవన విధానం పట్ల తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేస్తూ, “నాగార్జునని రెండు రోజులకు ఒకసారి తలుచుకుంటాను. ఎందుకంటే ఆయన జీవితాన్ని నిజంగా జీవిస్తున్నారు. సంపాదించడం, ఖర్చు చేయడం, ఇవ్వడం అన్నీ ఆయనకు తెలుసు. తెలివైనవాడు, ప్రతి విషయంలోనూ పూర్తి నిబద్ధతతో ఉంటాడు” అని ప్రశంసించారు. నాగార్జున ప్రాక్టికల్ ఆలోచనలు, జీవనశైలి తనకు నచ్చుతాయని జగపతి బాబు అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Ramya Krishna : రమ్యకృష్ణ కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. మొదటిసారి తనయుడి గురించి చెప్పిన కృష్ణ వంశీ..

Jagapathi Babu, Nagarjuna

ఎక్కువ మంది చదివినవి : Actress : ఏంట్రా బాబూ.. ఈ సీరియల్ బ్యూటీ ఇంతందంగా మారిపోయింది.. 100 పైగా సినిమాల్లో నటించింది..

Follow Us