Pushpa 2: రాఖీబాయ్ రికార్డ్స్ ను పుష్పరాజ్ బద్దలు కొడుతాడా..? ఆ విషయంలో పైచేయి ఎవరిదో!

అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 8న 'పుష్ప 2' టీజర్ విడుదల కానుండటంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా మూవీ పుష్ప 2 ప్రేక్షకుల ముందుకు రాకముందే జరగబోయే ప్రమోషన్స్ కి ఈ టీజర్ వేదికకానుంది. ఇక విషయానికి వస్తే కేజీఎఫ్ 2, పుష్ప 2 (రెండూ సీక్వెల్స్) బాక్సాఫీస్ క్లాష్ కానప్పటికీ, కేజీఎఫ్ 2 ఆల్ టైమ్ రికార్డ్ సాధించడం చర్చనీయాంశంగా మారింది.

Pushpa 2: రాఖీబాయ్ రికార్డ్స్ ను పుష్పరాజ్ బద్దలు కొడుతాడా..? ఆ విషయంలో పైచేయి ఎవరిదో!
Pushpa 2
Follow us

|

Updated on: Apr 04, 2024 | 8:49 PM

అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 8న ‘పుష్ప 2’ టీజర్ విడుదల కానుండటంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా మూవీ పుష్ప 2 ప్రేక్షకుల ముందుకు రాకముందే జరగబోయే ప్రమోషన్స్ కి ఈ టీజర్ వేదికకానుంది. ఇక విషయానికి వస్తే కేజీఎఫ్ 2, పుష్ప 2 (రెండూ సీక్వెల్స్) బాక్సాఫీస్ క్లాష్ కానప్పటికీ, కేజీఎఫ్ 2 ఆల్ టైమ్ రికార్డ్ సాధించడం చర్చనీయాంశంగా మారింది. కేజీఎఫ్ 2 టీజర్ 275 మిలియన్ వ్యూస్ తో ఇండియన్ సినిమాలో ఇప్పటివరకు మోస్ట్ లైక్స్ పొందిన టీజర్ గా నిలిచింది. మరే భారతీయ సినిమా టీజర్ కూడా ఈ టీజర్ కు దగ్గరగా లేదని టాలీవుడ్ టాక్.

దీంతో యూట్యూబ్ లో కేజీఎఫ్ 2 ఆల్ టైమ్ రికార్డ్ ను పుష్ప 2 టచ్ చేయగలదా అనే ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే పుష్ప మూవీ ఊహించినదాని కంటే హిట్ అవ్వడం, అల్లు అర్జున్ నటన హైలైట్ గా నిలవడంతో ఈ రికార్డు కొట్టడం సాధ్యమేనని భావిస్తున్నారు సినీ క్రిటిక్స్. యూట్యూబ్ వ్యూస్ ఒక రకంగా చెప్పాలంటే ఒక సినిమా రీచ్ ను, ప్రేక్షకుల్లో మరిన్ని భారీ అంచనాలు నెలకొల్పేలా చేస్తుంది. ఇది సినిమాకు బిగ్ మైలేజీగా నిలుస్తుందని చెప్పక తప్పదు. కేజీఎఫ్ 2 విషయంలో ఈ విషయం రుజువైంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లకు నిదర్శనంగా నిలిచింది. కాబట్టి యూట్యూబ్ లో పుష్ప 2కు లభించిన ఆదరణ చూస్తే దాని రీచ్ ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుంది.

యశ్ హీరోగా నటించిన కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలు పాన్ ఇండియా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. యశ్ బలమైన నటన, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ టేకింగ్ హైలెవల్ లో ఉండటంతో భారీ కలెక్షన్లు సాధించింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప మూవీ కూడా అంతేస్థాయిలో ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు అందరి కళ్లు పుష్ప2 పైనే ఉన్నాయి. ఈ మూవీ కేజీఎఫ్ 2 రికార్డులను బ్రేక్ చేస్తుందా? అని చర్చించుకుంటున్నారు.

వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో అతిభారీ వర్షాలు
వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో అతిభారీ వర్షాలు
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!