హిట్ కొట్టాలంటే డీ గ్లామర్ తప్ప మరో దారిలేదా..?

Updated on: Oct 12, 2026 | 11:46 AM

టాలీవుడ్‌లో హీరోయిన్లకు సాలిడ్ హిట్ కొట్టి స్టార్‌డమ్ దక్కించుకోవాలంటే కేవలం గ్లామర్ షో సరిపోదని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. సమంత, రష్మిక మందన్న బాటలో ఇప్పుడున్న తారలు డీ గ్లామర్ రోల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. మట్టి వాసన ఉండే సహజమైన పాత్రలు కెరీర్‌కు మైలేజ్ ఇస్తున్నాయని సినీ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి.

ఇండస్ట్రీలో హీరోయిన్లకు స్టార్‌డమ్ దక్కించుకోవాలంటే కేవలం గ్లామర్ పాత్రలు మాత్రమే సరిపోవని తాజా ట్రెండ్ స్పష్టం చేస్తోంది. సమంత, రష్మిక మందన్న వంటి తారలు డీ గ్లామర్ రోల్స్‌తో తమ కెరీర్‌కు ఊహించని మలుపులు తిప్పారు. రంగస్థలంలో రామలక్ష్మిగా సమంత, పుష్పలో శ్రీవల్లిగా రష్మిక పోషించిన పాత్రలు ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. ఈ పాత్రలు వారికి అవార్డులతో పాటు ఆడియన్స్ గుండెల్లో పర్మనెంట్ ప్లేస్‌ను సంపాదించిపెట్టాయి.ఈ విజయ ఫార్ములాను టాలీవుడ్‌లోని ఇతర హీరోయిన్లు కూడా అందిపుచ్చుకుంటున్నారు. శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న భోగి సినిమాలో అనుపమ పరమేశ్వరన్ సులోచన అనే పల్లెటూరి యువతిగా మేకప్ లేకుండా కనిపించనున్నారు. అదే సినిమాలో డింపుల్ హయాతి కూడా డీ గ్లామర్ పాత్రలోనే నటిస్తున్నారు. రష్మిక మందన్న కూడా పుష్ప 2 (మైసా)లో మరోసారి పూర్తిగా డీ గ్లామర్ అవతారంలోకి మారిపోయారు. ఆమె రణబలిలో కూడా అలాంటి పాత్రలోనే నటిస్తున్నారు. కీర్తి సురేష్ రౌడీ జనార్ధనలో రొటీన్ గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ, చాలా ఇంటెన్స్, డీ గ్లామర్ లుక్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అలాగే ఐశ్వర్య లక్ష్మి కూడా సంబరాల ఏటిగట్టులో పక్కా డీ గ్లామర్ రోల్‌లో కనిపించనున్నారు. మొత్తానికి, తాత్కాలిక గ్లామర్ కంటే మట్టి వాసనతో కూడిన సహజమైన కథలే హీరోయిన్ల కెరీర్‌కు ఎక్కువ మైలేజ్ ఇస్తాయని ఈ పరిణామాలు తెలియజేస్తున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us