AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Irumudi : అప్పుడు హీరోయిన్‏గా ఫెయిల్.. ఇప్పుడు విలన్‍గా ఇరగదీసింది.. ఇరుముడి టీచర్ తెలుగులో ఆ సినిమా చేసిందని తెలుసా.. ?

ఇరుముడి.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతున్న పేరు. మంచి హైప్ మధ్య అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అందుకుని కోట్లలో వసూల్లు రాబడుతుంది. చిన్నా, పెద్ద, యూత్ అందరూ ఈ సినిమాకు ఆకర్షితులు అవుతున్నారు. మాస్ యాక్షన్ సీన్లతోపాటు మనసును మెలిపెట్టే ఎమోషనల్ సీన్లతో ఈ సినిమా సాగుతుంది.

Irumudi : అప్పుడు హీరోయిన్‏గా ఫెయిల్.. ఇప్పుడు విలన్‍గా ఇరగదీసింది.. ఇరుముడి టీచర్ తెలుగులో ఆ సినిమా చేసిందని తెలుసా.. ?
Swasika
Rajitha Chanti
|

Updated on: Aug 25, 2026 | 6:18 PM

Share

మాస్ మహారాజా రవితేజ నటించిన లేటేస్ట్ సూపర్ హిట్ మూవీ ఇరుముడి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లతో దూసుకుపోతుంది ఈ సినిమా. చిన్నా, పెద్దా అందరూ ఈ సినిమాకు అట్రాక్ట్ అవుతున్నారు. చాలా కాలం తర్వాత ఈ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు రవితేజ. విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్లకు చేరువలో ఉంది ఈ సినిమా. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ డివోషనల్ ఎమోషనల్ థ్రిల్లర్ డ్రామా ప్రస్తుతం థియేటర్లలో సంచలనం సృష్టిస్తుంది. ఇందులో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటించగా.. ఆయన కూతురిగా మలయాళీ చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నక్షత్రం జీవించేసింది. అలాగే సాయి కుమార్, అజయ్ ఘోష్, జబర్దస్త్ ఫేమ్ కొమురక్క అలియాస్ నాగులు సైతం కీలకపాత్రలో మెప్పించారు. అయితే ఈ సినిమాలో మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకులకు కొట్టాలి అనిపించేంతగా కోపం తెప్పించిన పాత్ర మాతర్ం టీచర్ పాత్ర. ఈ పాత్రలో నటి స్వాసిక అనే కేరళ అమ్మాయి అని నటించింది. నటించడం కాదు.. ఈ పాత్రలో ఆమె ఒదిగిపోయిందనే చెప్పాలి.

ఎక్కువమంది చదివినవి : Aamani: నాకు లైఫ్ ఇచ్చింది ఆయనే.. ఆ హీరోతోనే ఎక్కువ సినిమాలు చేశా.. హీరోయిన్ ఆమని..

ఈ సినిమాలో మొదటి నుంచి ఆమె పాత్ర స్క్రీన్ పై కనిపిస్తే కొట్టాలి ఎలాగైనా అనేంత కోపం తెప్పించింది స్వాసిక. ఇదిలా ఉంటే.. ఇప్పుడు స్వాసిక గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు నెటిజన్స్. ఈ అమ్మడు తమిళం, మలయాళంలో అనేక చిత్రాల్లో నటించింది. అయితే తెలుగులో రెండు మూడు సినిమాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా తెలుగులో ఓ మూవీలో కథానాయికగానూ నటించింది. ఆమె తెలుగులో చేసిన మొదటి సినిమా ఎటు చూసినా నువ్వే. ఇందులో సాయి క్రిష్ హీరోగా నటింగా… 2012లో ఈ మూవీ విడుదలైంది. ప్రభాస్ నటించిన రెబల్ సినిమా విడుదలైన సమయంలో రావడంతో ఈ మూవీ వచ్చినట్టు కూడా తెలియదు. ఆ తర్వాత దాదాపు 13 ఏళ్లు తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు.

ఎక్కువమంది చదివినవి : Chalaki Chanti: వాడు నా పొట్ట కొట్టాడు.. నాకు అవకాశాలు రాకుండా చేశాడు.. చలాకీ చంటి..

మలయాళంలో వరుస సినిమాలతో మెప్పించిన స్వాసిక.. గతేడాది విడుదలైన తమ్ముడు చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది. అయితే ఈ మూవీ డిజాస్టర్ కావడంతో ఆమె పాత్ర ఎక్కువగా హైలెట్ కాలేదు. అలాగే శంబాల సినిమాలోనూ ఆమె నటించింది. ఇప్పుడు ఇరుముడి సినిమాతో ఆమెకు తెలుగులో బ్రేక్ వచ్చింది. దీంతో రాబోయే రోజుల్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె మరింత బిజీ కావడం ఖాయమని తెలుస్తోంది.

ఎక్కువమంది చదివినవి :  Eshwar Sai : ఆ టైంలోనే మాధురి నాకు కనెక్ట్ అయ్యింది.. ఆమె చాలా మంచిది.. నోరు విప్పిన ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర సాయి..

స్వాసిక సినిమా..

Swasika Movie

Swasika Movie

ఎక్కువమంది చదివినవి :  Comedian Sudhakar: ఒక్క సినిమాకు రూ.30 వేల రెమ్యునరేషన్.. ఆస్తులపై క్లారిటీ ఇచ్చిన నటుడు సుధాకర్..

Follow Us
మళ్లీ దిగొస్తున్న బంగారం ధరలు.. తులంపై ఎంత తగ్గిందంటే?
మళ్లీ దిగొస్తున్న బంగారం ధరలు.. తులంపై ఎంత తగ్గిందంటే?
ఆకతాయిలకు జూనియర్ వార్నింగ్‌... ఎవ్వరినీ వదిలిపెట్టనన్న ఎన్టీఆర్‌
ఆకతాయిలకు జూనియర్ వార్నింగ్‌... ఎవ్వరినీ వదిలిపెట్టనన్న ఎన్టీఆర్‌
రణబాలి కథ రివీల్ చేసిన దర్శకుడు!
రణబాలి కథ రివీల్ చేసిన దర్శకుడు!
నెలకు ఒక్క మ్యాచ్ మాత్రమే చూపించే విభిన్న డేటింగ్ యాప్ !
నెలకు ఒక్క మ్యాచ్ మాత్రమే చూపించే విభిన్న డేటింగ్ యాప్ !
ఇవి రోజూ తింటే యవ్వనం ఉరకలెయ్యడం గ్యారంటీ.. అస్సలు వదలొద్దు
ఇవి రోజూ తింటే యవ్వనం ఉరకలెయ్యడం గ్యారంటీ.. అస్సలు వదలొద్దు
నీళ్లలో కరిగిన చక్కెరను వేరు తీయాలి.. నీళ్లు మాత్రం వృధా చేయకూడదు
నీళ్లలో కరిగిన చక్కెరను వేరు తీయాలి.. నీళ్లు మాత్రం వృధా చేయకూడదు
ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్‌ కోసం స్పెషల్ ట్రిబ్యూట్!
ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్‌ కోసం స్పెషల్ ట్రిబ్యూట్!
మానవ శరీర భాగాలతో పూజలు చేస్తే అద్భుత శక్తులు వస్తాయని.. దారుణం
మానవ శరీర భాగాలతో పూజలు చేస్తే అద్భుత శక్తులు వస్తాయని.. దారుణం
పెళ్లైన నాలుగేళ్లకే విడాకులు.. చిన్న విషయానికే ఇంట్లో యుద్ధం
పెళ్లైన నాలుగేళ్లకే విడాకులు.. చిన్న విషయానికే ఇంట్లో యుద్ధం
ఇమ్రాన్ ఖాన్ పరిస్థితిపై రవిశాస్త్రి ఆగ్రహం
ఇమ్రాన్ ఖాన్ పరిస్థితిపై రవిశాస్త్రి ఆగ్రహం