Johnny Depp vs Amber Heard: మాజీ భర్తకు అనుకూలంగా తీర్పు.. కోర్టులోనే వెక్కి వెక్కి ఏడ్చిన హీరోయిన్..

|

Jun 02, 2022 | 11:54 AM

జానీ డెప్, అతని మాజీ భార్య అంబర్ హర్డ్ ఇద్దరూ పరువు నష్టం పొందేందుకు అర్హులేనని తేల్చీ చెప్పింది. ఏడుగురు సభ్యులున్న జ్యూరీ నటుడు జానీ డెప్ కు అనుకూలంగా తీర్పు

Johnny Depp vs Amber Heard: మాజీ భర్తకు అనుకూలంగా తీర్పు.. కోర్టులోనే వెక్కి వెక్కి ఏడ్చిన హీరోయిన్..
Jonny
Follow us on

హాలీవుడ్ నటీనటులు జానీ డెప్ అతని మాజీ భార్య అంబర్ హర్డ్‏కు వర్జీనియా ఫెయిరీ ఫ్యాక్స్ కౌంటీ కోర్టు షాకింగ్ తీర్పు ఇచ్చింది. జానీ డెప్, అతని మాజీ భార్య అంబర్ హర్డ్ ఇద్దరూ పరువు నష్టం పొందేందుకు అర్హులేనని తేల్చీ చెప్పింది. ఏడుగురు సభ్యులున్న జ్యూరీ నటుడు జానీ డెప్ కు అనుకూలంగా తీర్పు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. 2018లో అంబర్ హర్ట్ రాసిన వయొలెన్స్ ఆర్టికల్ జానీ డెప్ పరువుకు భంగం కలిగించేందిగా ఉందని అంచనాకు వచ్చామని జ్యూరీ పేర్కొంది.. ఆరు వారాల పాటు వీరిద్దరి మధ్య పోటా పోటీ ఆరోపణలతో విచారణ కొనసాగింది. ఆరు వారాల పాటు సాగిన విచారణ అనంతరం కోర్డు నటుడు జానీ డెప్ కు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో కలకలం రేగింది.

అయితే జ్యూరీ ఇచ్చిన తీర్పున్న వెంటనే హీరోయిన్ అంబర్ హర్డ్ కోర్టునే బోరున ఏడ్చేసింది. కోర్టు ఇచ్చిన తీర్పు తనకు మాత్రమే కాకుండా.. మహిళలందరికీ ఎదురుదెబ్బ అని అభిప్రాయం వ్యక్తం చేశింది. తన మాజీ భర్త అసమానమైన శక్తి ముందు తాను ఎదుర్కోవడానికి సరిపడ సాక్ష్యాలు సరిపోలేదని….కోర్టు తీర్పుతో తన గుండె బద్దలైందని తెలిపారు. ఎక్కువగా మాట్లాడే స్త్రీలను బహిరంగంగానే అవమానించేలా ఉందని.. మహిళలపై హింసను మరింత పెంచేందుకు ప్రోత్సాహిస్తుందని హార్డ్ ఎమోషనల్ అయ్యింది.

ఇవి కూడా చదవండి

కోర్టు తీర్పు అనంతరం జానీ డెప్ ఎమోషనల్ అయ్యాడు.. తన జీవితం తనకు ఇచ్చారని.. జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు చెబుతూ భావోద్వేగానికి గురయ్యాడు.. 2015లో జానీ డెప్, అంబర్ హర్డ్ ల వివాహం జరిగింది. కానీ ఏడాదికే వాళ్ల మధ్య మనస్పర్థలు వచ్చాయి. 2017లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. అయితే కొద్ది రోజులకే వీరిద్ధరు ఒకరి మీద మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు.