
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ బిగ్ ప్రాజెక్టులలో కాకా ఒకటి. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఈ చిత్రం గురించి రోజుకో న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తుంది. తాజాగా కాకా చిత్రం నుంచి ఓ క్రేజీ న్యూస్ వైరలవుతుంది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ఫుల్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో వచ్చే చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘కాకా’. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనగా, తాజాగా చిత్ర యూనిట్ నుండి వచ్చిన ఒక క్రేజీ అప్డేట్ మెగా అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలో మాస్ సాంగ్స్‌తో అలరించిన ఈ కాంబో, ఇప్పుడు ‘కాకా’ సినిమా కోసం మరోసారి మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో ఒక ప్రత్యేకమైన మాస్ నంబర్ సాంగ్ కోసం టాలెంట్ టాలెంటెడ్ బ్యూటీ రితికా సింగ్ ను ఎంపిక చేశారని టాక్. మెగాస్టార్ తో కలిసి ఈ అమ్మడు స్టెప్పులు వేయనున్నట్లు సమాచారం.
ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: ఏం ట్విస్టులు రా బాబూ.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రెండింగ్‌లో నంబర్ వన్..
దర్శకుడు బాబీకి మెగాస్టార్ చిరంజీవి చిత్రాలలో మాస్ సాంగ్స్, స్పెషల్ నంబర్ల ప్రాధాన్యత ఏంటో బాగా తెలుసు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలో “బాస్ పార్టీ” సాంగ్ ఎంత పెద్ద సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు అదే జోరును కొనసాగిస్తూ ‘కాకా’ చిత్రంలోనూ ఒక మాస్ సాంగ్‌ను ప్లాన్ చేశారు. ఈ చిత్ర కథాంశం ప్రకారం ఇందులో రొమాంటిక్ ట్రాక్ లేదా సాంప్రదాయ హీరోయిన్ పాత్ర ఉండదని ప్రచారం నడుస్తున్నప్పటికీ, చిత్రంలో వచ్చే ఒక ఊరమాస్ ప్రత్యేక పాట మాత్రం సినిమాకే హైలైట్‌గా నిలవనుందని తెలుస్తోంది. ఈ స్పెషల్ సాంగ్ కోసం వైవిధ్యమైన పాత్రలతో మెప్పించే రితికా సింగ్‌ను ఎంపిక చేయడం విశేషం.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : నన్ను అహాంకారి అనుకున్నారు.. 1500 సినిమాలు చేసినా ఏమీ మిగల్లేదు.. సీనియర్ నటుడు..
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం, వచ్చే ఏడాది 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. మెగాస్టార్ చిరంజీవి మాస్ ఇమేజ్‌కు తగినట్లుగా పక్కా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి రానున్న రోజుల్లో మరిన్ని అధికారిక అప్డేట్స్ వెలువడనున్నాయి. రితికా సింగ్ – చిరంజీవి కాంబినేషన్లో రానున్న ఈ మాస్ సాంగ్ థియేటర్లలో ప్రేక్షకులను కూర్చోనివ్వకుండా చేయడం ఖాయమని తెలుస్తోంది.
ఎక్కువ మంది చదివినవి : Megastar Chiranjeevi: చిరంజీవికి భార్యగా, చెల్లిగా నటించిన ఏకైక హీరోయిన్.. 20 ఏళ్లుగా తగ్గని స్టార్ డమ్..
ఎక్కువ మంది చదివినవి : Gulabi Movie: ఒక్క పాటతో స్టార్ డమ్.. గులాబీ సినిమాను మిస్సైన హీరోయిన్.. ఎవరంటే..