Ajith : అమ్మాయిలు పడిచచ్చే యంగ్ హీరో.. అజిత్ పక్కన ఉన్న ఈ కుర్రాడిని గుర్తుపట్టారా.. ?
కోలీవుడ్ స్టార్ అజిత్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. దశాబ్దాలుగా సినీరంగంలో స్టార్ హీరోగా వరుస సినిమాలతో తనదైన ముద్ర వేశారు. ఇప్పటికీ హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా అలరిస్తున్నారు. మరోవైపు కార్ రేసింగ్ తో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. తాజాగా అజిత్ కు సంబంధించిన త్రోబ్యాక్ ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరోను గుర్తుపట్టారా.. ? ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరో. ముఖ్యంగా అతడికి అమ్మాయిలలో క్రేజ్ ఎక్కువే. అతడు మరెవరో కాదండి.. అతడు తమిళ యంగ్ నటుడు సర్వ. ఈ పేరు చెబితే గుర్తుపట్టలేరు. కానీ ఇటీవల ఒక్క వెబ్ సిరీస్ తో సౌత్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల హాట్‌స్టార్‌లో విడుదలైన ‘హార్ట్‌బీట్’ అనే వెబ్ సిరీస్‌లో గుణ పాత్రలో నటించి మెప్పించాడు. ఇప్పుడిప్పుడే సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నాడు. హార్ట్ బీట్ సిరీస్ ద్వారా అతడికి మంచి గుర్తింపు వచ్చింది.
ఎక్కువమంది చదివినవి : Actress : ఆదర్శ కుటుంబంలోకి మరో హీరోయిన్.. ప్లాప్ హీరోయిన్‌కు మళ్లీ ఛాన్స్ ఇచ్చిన త్రివిక్రమ్.. ?
హార్ట్‌బీట్’ వెబ్ సిరీస్ రెండు సీజన్‌లలోనూ గుణ పాత్రతో పాపులర్ అయ్యాడు. ఇప్పుడిప్పుడే సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్న సర్వ… ప్రస్తుతం అథర్వా హీరోగా నటించిన ‘తనల్’ చిత్రంలో కీలకపాత్ర పోషించాడు. హీరోగా మంచి ఫాం ఉన్న సమయంలోనే నెగిటివ్ పాత్రలు పోషించేందుకు సైతం రెడీగా ఉన్నట్లు తెలిపాడు. కంటెంట్, పాత్ర ప్రాధాన్యతను బట్టి తాను విలన్ పాత్రలు సైతం చేసేందుకు సిద్ధం అని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
ఎక్కువమంది చదివినవి : Actor : ఆరుగురు పతివ్రతలు తర్వాత మళ్లీ సినిమాలు చేయలేదు.. కారణం ఇదే.. టాలీవుడ్ నటుడు..
ఇక అజిత్ సినిమాల విషయానికి వస్తే.. ఎలాంటి సినీ నేపథ్యంలో లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా మారారు. తన నటనతో కోట్లాది మంది అభిమాన హీరోగా మారి అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు. అజిత్ చివరిసారిగా గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో నటించారు. ప్రస్తుతం డైరెక్టర్ అదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. అలాగే అటు అంతర్జాతీయ కార్ రేస్ పోటీల్లో పాల్గొంటూ పథకాలను గెలుచుకుంటారు.
ఎక్కువమంది చదివినవి : Tollywood: శ్రీదేవి తర్వాత అంత అందమైన హీరోయిన్ ఆమె.. కానీ తన అమ్మ వల్లే ఆమె జీవితం అలా.. నటుడు మురళీ మోహన్..
View this post on Instagram
ఎక్కువమంది చదివినవి : Cinema : సీన్ సీన్‌కు గుండె ఆగిపోద్ది మావ.. క్లైమాక్స్ మాత్రం బీభత్సం.. యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న హారర్ సిరీస్..
