వెనక్కి తగ్గిన ఆ ఇద్దరు.. బరిలోకి బాలయ్య..?

వెనక్కి తగ్గిన ఆ ఇద్దరు.. బరిలోకి బాలయ్య..?

ప్రతి ఏడాదిలో చివరగా వచ్చే పండుగ క్రిస్మస్. డిసెంబర్ 25న క్రిస్మస్ ఉండగా.. ఆ తరువాత ఆరు రోజులకు కొత్త సంవత్సరం వస్తుంది. దీంతో ఈ సీజన్‌కు మంచి డిమాండ్‌ ఉంటుంది. అందుకే చిన్న హీరోలు కూడా తమ సినిమా విడుదలకు ఈ సీజన్‌ను ఎంచుకుంటుంటారు. ఇక ఈ ఏడాది టాలీవుడ్‌లో పలు సినిమాలు క్రిస్మస్ బరిలో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా డిస్కో రాజా, భీష్మ, ప్రతి రోజు పండుగే సినిమాలను ఈ క్రిస్మస్‌కు విడుదల చేయాలని […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Oct 18, 2019 | 1:41 PM

ప్రతి ఏడాదిలో చివరగా వచ్చే పండుగ క్రిస్మస్. డిసెంబర్ 25న క్రిస్మస్ ఉండగా.. ఆ తరువాత ఆరు రోజులకు కొత్త సంవత్సరం వస్తుంది. దీంతో ఈ సీజన్‌కు మంచి డిమాండ్‌ ఉంటుంది. అందుకే చిన్న హీరోలు కూడా తమ సినిమా విడుదలకు ఈ సీజన్‌ను ఎంచుకుంటుంటారు. ఇక ఈ ఏడాది టాలీవుడ్‌లో పలు సినిమాలు క్రిస్మస్ బరిలో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా డిస్కో రాజా, భీష్మ, ప్రతి రోజు పండుగే సినిమాలను ఈ క్రిస్మస్‌కు విడుదల చేయాలని అనుకున్నారు. అలాగే శర్వానంద్, సమంత నటిస్తున్న 96 రీమేక్‌ను కూడా అదే రోజున రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సీజన్ నుంచి రెండు సినిమాలు ఔట్ అయినట్లు తెలుస్తోంది.

వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ నటిస్తోన్న డిస్కో రాజా.. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ నటిస్తోన్న భీష్మ ఈ చిత్రాల విడుదల వాయిదా పడ్డట్లు తెలుస్తోంది. కారణాలు తెలీవు గానీ క్రిస్మస్ బరి నుంచి ఈ రెండు చిత్రాలు తప్పుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా ఈ బరిలోకి బాలయ్య ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య నటిస్తోన్న 105 చిత్రాన్ని క్రిస్మస్‌కు విడుదల చేయాలన్న ఆలోచనలో చిత్ర దర్శకనిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఈ క్రిస్మస్ సీజన్‌లో బాలయ్య, సాయి ధరమ్ తేజ్ మధ్య పోటీ ఉండబోతుందన్న మాట.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu