
టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం స్లమ్ డాగ్ చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సీనియర్ బ్యూటీ టబు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుంచి విడుదలైన ఈ మూవీ గ్లింప్స్ అంచనాలు పెంచేసింది. ఇదెలా ఉంటే.. గతంలో ఓ ఇంటర్వ్యూలో పూరి మాట్లాడుతూ తాను వందల కోట్ల ఆస్తి పోవడానికి గల కారణాలను వెల్లడించారు. శత్రువు విసిరిన కత్తి కంటే నమ్మిన స్నేహితుడు విసిరిన కత్తికే పదునెక్కువ అని, అది తనకు నిజ జీవితంలో చాలాసార్లు అనుభవమైందని ఆయన పేర్కొన్నారు. తన జీవితంలో నమ్మిన స్నేహితులు చేసిన మోసాల వల్ల దాదాపు వంద కోట్లకు పైగా ఆస్తిని పోగొట్టుకున్నానని పూరి జగన్నాథ్ వెల్లడించారు. కేవలం రచయితలు, దర్శకుల డైలాగులు మాత్రమే కాదని, నిజ జీవితంలో అలాంటి సంఘటనలు జరిగితేనే అవి అంతగా ప్రభావం చూపుతాయని పూరి జగన్నాథ్ అభిప్రాయపడ్డారు.
తనను నమ్మిన చాలామంది స్నేహితులు మోసం చేశారని, కత్తి విసరాల్సిన అవసరం లేకుండానే పక్క నుంచి పొడిచారని ఆయన గుర్తు చేసుకున్నారు. అదెలా జరిగిందో, ఎప్పుడు జరిగిందో కూడా తెలియకుండానే తన జీవితంలోకి ఆ నమ్మక ద్రోహం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ మోసాల కారణంగా తన మధ్యలో ఉన్న ఆస్తి మొత్తం పోయిందని, దాదాపు వంద కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని ఆయన సంచలన విషయాలను బయటపెట్టారు. ఒక దశలో తాను రోడ్డున పడ్డానని పూరి జగన్నాథ్ వివరించారు.
ఎక్కువమంది చదివినవి: Cinema : ఓటీటీలో వణుకుపుట్టిస్తోన్న తెలుగు సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్.. ట్రెండింగ్ అవుతున్న ఈ మూవీని చూశారా.. ?
తనకు డబ్బుపై పెద్దగా ఆసక్తి లేకపోవడం, కేవలం కథలు రాయడం, సినిమాలు తీయడం వంటి సృజనాత్మక పనులపైనే పూర్తిగా దృష్టి సారించడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని ఆయన తెలిపారు. ఎక్కడి నుంచి వచ్చాము, ఎంత ఎదిగాము అనేది తెలుసు కాబట్టి అప్పుడప్పుడు ఆర్థిక లెక్కలు చూసుకోవడం, ఏం జరుగుతుందో పర్యవేక్షించడం అవసరమని ఇప్పుడు తాను గుర్తించానని అన్నారు. డబ్బు వ్యవహారాలను ఇతరులకు అప్పగించి, వారిని గుడ్డిగా నమ్మడం తన తప్పేనని ఆయన అంగీకరించారు. తప్పు జరిగిన తర్వాతే అది తప్పని గ్రహించినట్లు ఆయన చెప్పారు.
ఎక్కువమంది చదివినవి: Cinema: సినిమాగా తీసిన పాపులర్ నాటకం.. థియేటర్లను షేక్ చేసిన దాసరి మూవీ.. 225 రోజులు ఆడి రికార్డు..
ఇప్పుడు తాను చాలా జాగ్రత్తగా ఉంటున్నానని, గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకుంటున్నానని పూరి జగన్నాథ్ స్పష్టం చేశారు. తనను మోసం చేసిన వ్యక్తి మళ్లీ ఎదురుపడితే, ఆ వ్యక్తిని తన మనసులో నుంచి పూర్తిగా చెరిపివేస్తానని, వాడు తన కళ్ళకు కనిపించడని, వాడు ఉన్నట్టే తాను పట్టించుకోనని ఆయన అన్నారు. మోసం చేసిన వ్యక్తి ఎదురుపడితే అసలు అతడు తనకు తెలియదన్నట్టే ఉంటానని అన్నారు. ఈ సంఘటనలు తన జీవితంలో ఒక పెద్ద పాఠాన్ని నేర్పాయని ఆయన చెప్పుకొచ్చారు.
ఎక్కువమంది చదివినవి: Trending Song: యూట్యూబ్ షేక్ చేస్తున్న బతుకమ్మ సాంగ్.. రెండు రోజుల్లోనే 7 లక్షల వ్యూస్.. డీజేలలో మారుమోగిపోతుంది..
ఎక్కువమంది చదివినవి: Tollywood : అలాంటి నటుడిని ఎక్కడా చూడలేదు.. అతడు ప్రపంచంలోనే నెంబర్ వన్ యాక్టర్.. టాలీవుడ్ విలన్..