దొరికేశారు.. టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు చేసిన వారు అరెస్ట్.. నిందితులు ఎవరంటే

బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల ఘటన ముంబైలో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు కీలక ఆధారం లభించినట్లు సమాచారం. దుండగులు ఉపయోగించినట్లు అనుమానిస్తున్న పల్సర్ మోటార్‌సైకిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాల్పులు జరిపిన అనుమానితుల ఫొటోలు కూడా వెలుగులోకి వచ్చాయి.

దొరికేశారు.. టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు చేసిన వారు అరెస్ట్.. నిందితులు ఎవరంటే
Tiger

Updated on: Oct 19, 2026 | 1:14 PM

టైగర్ ష్రాఫ్ పై దాడి జరిగిన విషయం తెలిసిందే..  టైగర్ ష్రాఫ్ లక్ష్యంగా జరిగిన హత్యాయత్నం కుట్రలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మోస్ట్ వాంటెడ్ గా ఉన్న ముగ్గురు నిందితులను రాజస్థాన్‌లోని కోటా రైల్వే స్టేషన్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైలులో ప్రయాణిస్తుండగా పక్కా సమాచారంతో ఈ ఆపరేషన్ నిర్వహించారు. అరెస్ట్ అయిన ముగ్గురు నిందితులు కూడా గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్  గ్యాంగ్‌కు చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. వీరిలో ఇద్దరు నేరానికి పాల్పడేందుకు కిరాయికి మాట్లాడిన హంతకులు కాగా, మూడో వ్యక్తి దాడి తర్వాత వారు సురక్షితంగా పరారయ్యేందుకు సహకరించినట్లు అనుమానిస్తున్నారు.

నా భర్త మామూలోడు కాదు.. 9మంది అమ్మాయిలను మోసం చేశాడు

నిందితుల వివరాలు ఫూల్ సింగ్ (17): హర్యానాలోని సోనిపట్ నివాసి. హృతిక్ కుమార్ అలియాస్ రోషన్ (22): బీహార్‌లోని బెగుసరాయ్ నివాసి. ప్రస్తుతం ముంబైలోని అంధేరి వెస్ట్ ప్రాంతంలోంటూ ఉంటూ రాపిడో రైడర్‌గా పనిచేస్తున్నాడు. రెహాన్ (18): హర్యానాలోని సోనిపట్ నివాసి ఈ ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Tollywood : ఒకప్పుడు కుర్రాళ్ల కలల రాకుమారి.. ఇప్పుడు సినిమాలకు దూరం ఇలా ..

బాలీవుడ్ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని ఈ తరహా దాడులకు పాల్పడుతున్న నెట్‌వర్క్ వెనుక ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కోటాలో పట్టుబడిన ఈ ముగ్గురిని మరింత విచారిస్తే మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

ఏడాది మొత్తం విజయ్‌ను మనం పెళ్లి చేసుకుందాం అని అడుగుతూనే ఉన్నా: రష్మిక మందన్న

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us