బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ ఇటీవలే పఠాన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ చిత్రంలో షారుఖ్ సరసన దీపికా పదుకొణె నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబట్టింది. ఇక ఇప్పుడు బాద్ షా ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జవాన్’. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 7న విడుదల కానుంది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో అడియన్స్ ముందుకు రానుంది. అలాగే ‘జవాన్’ ట్రైలర్‌ను ‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమా థియేటర్స్‌లో ప్రదర్శించబోతున్నట్లు ఇదివరకే మేకర్స్ ప్రకటించారు. డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాపై పాన్ ఇండియా లెవల్లో భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇదివరకే మ్యూజిక్ రైట్స్ విషయంలో సెన్సేషన్ క్రియేట్ చేసింది జవాన్ సినిమా.. తాజాగా ఈ చిత్రం మరో రికార్డ్ క్రియేట్ చేసింది. ఓవైపు ట్రైలర్ విడుదలకు సన్నాహాలు జరుగుతుండగా.. ఇప్పుడే థియేట్రికల్ హక్కులు రూ.250 కోట్లకు అమ్ముడు అయినట్లు తెలుస్తోంది.
పాన్ ఇండియా లెవల్లో షారుఖ్ సినిమాల కోసం ఎదురుచూస్తుంటారు సినీప్రియులు. నిజానికి ఒకప్పుడు బాద్ సినిమాలకు సంబంధించిన హక్కులన్నీ ఫ్యాన్స్ రేట్లకే అమ్ముడవుతుంటాయి. గత కొన్నాళ్లుగా వరుసగా డిజాస్టర్స్ అందుకున్న బాద్ షా.. ఇప్పుడు ఆయన సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి. అంతేకాకుండా.. రైట్స్ విషయంలో గత సినిమాల రికార్డులను తాజా చిత్రాలు దాటేస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఎలాంటి సరైన అప్డేట్స్ ఇవ్వని జవాన్ చిత్రానికి థియేట్రికల్ హక్కులు భారీ ధరకే అమ్ముడయినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. యాక్షన్ ఎలిమెంట్స్, అద్భుతమైన నటనతో జవాన్ ట్రైలర్ కోసం ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మూవీ లవర్స్. జవాన్‌పై భారీ క్రేజ్ క్రియేట్ అయ్యింది. దీంతో ఈ సినిమా థియేట్రికల్ హక్కుల కోసం పోటీ ఎక్కువగానే ఉంది. ఇక నాన్ థియేట్రికల్ హక్కులు ఇంత ధరకు అమ్ముడవటం చూస్తుంటే షారూక్ ఖాన్‌కి ఉన్న క్రేజ్ ఎంటనేది స్పష్టమైంది. షా