Ajay Devgn: ‘హీరోకు నమస్కారం చేయనుందుకు సినిమా నుంచి తీసేశారు’.. సీనియర్ నటుడి సంచలన వ్యాఖ్యలు

|

Aug 17, 2024 | 7:16 PM

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం 'సన్ ఆఫ్ సర్దార్ 2'. 2012లో వచ్చిన సూపర్ హిట్ మూవీ సన్నాఫ్ సర్దార్ కు ఇది సీక్వెల్. తెలుగులో వచ్చిన మర్యాద రామన్న మూవీకి ఇది రీమేక్‌. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లండన్ లో శర వేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమాను వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి నటుడు సంజయ్ దత్ తప్పుకున్నట్లు  వార్తలు వచ్చాయి.

Ajay Devgn: హీరోకు నమస్కారం చేయనుందుకు సినిమా నుంచి తీసేశారు.. సీనియర్ నటుడి సంచలన వ్యాఖ్యలు
Ajay Devgn, Vijay Raaz
Follow us on

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘సన్ ఆఫ్ సర్దార్ 2’. 2012లో వచ్చిన సూపర్ హిట్ మూవీ సన్నాఫ్ సర్దార్ కు ఇది సీక్వెల్. తెలుగులో వచ్చిన మర్యాద రామన్న మూవీకి ఇది రీమేక్‌. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లండన్ లో శర వేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమాను వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి నటుడు సంజయ్ దత్ తప్పుకున్నట్లు  వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరో ప్రముఖ నటుడు విజయ్‌ రాజ్‌ను చిత్ర బృందం నుంచి తొలగించింది. నటీనటుల్లో మార్పు సహజం. అయితే కారణం ఏమిటి అనేది ముఖ్యం. అయితే ‘సన్‌ ఆఫ్‌ సర్దార్‌ 2’ హీరో అజయ్‌ దేవగణ్‌కి సెల్యూట్‌ చేయని కారణంగానే తనను సినిమా నుంచి తొలగించారంటూ విజయ్‌ రాజ్‌ సంచలన ఆరోపణలు చేయడం బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. ‘నేను వ్యానిటీ వ్యాన్‌లోంచి దిగేసరికి 25 మీటర్ల దూరంలో అజయ్ దేవగన్ నిలబడి ఉన్నాడు. అతను బిజీగా ఉన్నందున నేను అతనితో మాట్లాడలేదు. ఇది జరిగిన 25 నిమిషాల తర్వాత నిర్మాత వచ్చి నిన్ను సినిమా నుంచి తీసేశామని చెప్పారు’ అని విజయ్ రాజ్ చెప్పుకొచ్చారు.

‘అజయ్ దేవగన్‌తో మాట్లాడకపోవడం, ఆయనకు నమస్కారం చేయకపోవడమే నేను చేసిన తప్పు. చిత్ర బృందంలో మరెవరినీ నేను కలవలేదు. అజయ్ దేవగన్‌కి నమస్కారం చేయకపోవడంతో షూటింగ్ సెట్‌కి వచ్చిన 25 నిమిషాల తర్వాత నన్ను తొలగించామని చెప్పారు. వారంతా చాలా ప్రభావం చూపే వ్యక్తులు’ అని విజయ్ రాజ్ తెలిపారు. ఇదే విషయంపై ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ చిత్ర నిర్మాత మీడియాతో మాట్లాడుతూ.. ‘షూటింగ్ సమయంలో విజయ్ రాజ్ సరిగా ప్రవర్తించడం లేదు. ఆయనకి విశాలవంతమైన గదులు కావాలట.. పెద్ద వానిటీ వ్యాన్‌ కావాలని డిమాండ్‌ చేస్తున్నాడు. పైగా అతని కిందపనిచేసేవారికి రోజుకు రూ.20,000 ఇవ్వాలంటున్నాడు. పెద్ద పెద్ద నటులు కూడా అంత మొత్తం తీసుకోరు. లండన్ లో అందరికీ మంచి గదులు తీసుకున్నాం. ఒక్క రోజుకు ఒక్క గది అద్దె.. రూ.45,000. అయినా అది తనకు సరిపోవడంలేదట! ఇంకా పెద్ద లగ్జరీ రూమ్‌ కావాలన్నాడు. విపరీతమైన డిమాండ్లు చేయడం వల్లే అతడిని తొలగించాం’ అని చెప్పుకొచ్చారు. అయితే ఈ వివాదంపై అజయ్ దేవగన్ ఇప్పటివరకు స్పందించలేదు. విజయ్ రాజ్ చాలా సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. బాలీవుడ్‌లో అతనికి మంచి డిమాండ్‌ ఉంది

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.